Payal Rajput: మంగళవారం పైనే ఆశ పెట్టుకున్న పాయల్ రాజ్‌పుత్..
అజయ్, పాయల్ కాంబోలో రూపొందుతున్న రెండో మూవీ ఇది. మహాసముద్రం మూవీతో ఘోర పరాభవాన్ని చవిచూసిన అజయ్ భూపతి.. ఈసారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను నమ్ముకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతల మీదుగా ఇటీవలే ట్రైలర్ రిలీజైంది.

Payal Rajput: ఆర్ఎక్స్100 వంటి రొమాంటిక్ మూవీ తీసిన అజయ్ భూపతి ఈసారి రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌తో వస్తున్నాడు. సినిమాకు ‘మంగళవారం’ అంటూ ఆసక్తికర టైటిల్ పెట్టాడు. ఆర్ఎక్స్100 భామ పాయల్ రాజ్‌పుత్ లీడ్ రోల్ పోషిస్తోంది. అజయ్, పాయల్ కాంబోలో రూపొందుతున్న రెండో మూవీ ఇది.
మహాసముద్రం మూవీతో ఘోర పరాభవాన్ని చవిచూసిన అజయ్ భూపతి.. ఈసారి హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను నమ్ముకున్నాడు. మెగాస్టార్ చిరంజీవి చేతల మీదుగా ఇటీవలే ట్రైలర్ రిలీజైంది. సినిమా నవంబర్ 17న రిలీజ్ అవుతోంది. సినిమాకు మంగళవారం అన్న టైటిల్ ఎందుకు పెట్టాడో ట్రైలర్‌లో చెప్పేశాడు దర్శకుడు. మంగళవారం వచ్చిందంటే చాలు ఊరిలో శవం లేవాల్సిందే. అసలు ఆ హత్యలు చేస్తుంది ఎవరు..? మంగళవారం నాడే ఎందుకు చేస్తున్నారు..? ముసుగు వేసుకుని గోడలపై రాతలు రాసేది ఎవరంటూ.. ట్రైలర్‌ను వదిలాడు.
కాంతార ఫేం అజనీష్ లోక్ నాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆర్‌ఎక్స్100 తర్వాత పాయల్ ఎన్ని సినిమాలు చేసినా.. ఒక్కటీ సక్సెస్ కాలేదు. డిస్కోరాజా.. వెంకీమామలో రవితేజ, వెంకటేశ్ వంటి సీనియర్స్‌తో నటించినా అదృష్టం కలిసిరాలేదు. చివరికి హిట్ ఇచ్చినా దర్శకుడినే నమ్ముకుంది పాయల్. ఈ సినిమా తనకు హిట్ అందిస్తుందేమో చూడాలి.