Disha Patani : దిశా పటానీ చేతిపై PD అనే టాటూ…ప్రభాస్‌తో ఎఫైర్

కల్కి సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్‌కు లింక్ పెట్టేశారు గాసిప్ రాయుళ్లు. దిశా పటానీ షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమె పై కనిపించిన PD అనే టాటూ.. హాట్ టాపిక్‌గా మారింది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 5, 2024 | 01:00 PMLast Updated on: Jul 05, 2024 | 1:00 PM

Pd Tattoo On Disha Patanis Arm Affair With Prabhas

 

 

కల్కి సినిమాలో కలిసి నటించిన దిశా పటానీతో ప్రభాస్‌కు లింక్ పెట్టేశారు గాసిప్ రాయుళ్లు. దిశా పటానీ షేర్ చేసిన ఓ ఫోటోలో ఆమె పై కనిపించిన PD అనే టాటూ.. హాట్ టాపిక్‌గా మారింది. అసలు ‘PD’ అంటే ఏంటి అని ఆరా తీసే పనిలో పడిపోయారు. P అంటే ప్రభాస్, D అంటే దిశా కాబట్టి.. అమ్మడు ప్రభాస్ కోసమే ఆ టాటూ వేయించుకుందనే టాక్ మొదలైంది. అంతేకాదు.. ప్రభాస్ డార్లింగ్.. అని అర్థం వచ్చేలా టాటూ వేయించుకుందా అనే కామెంట్స్ కూడా వినిపించాయి. కొందరైతే.. అమ్మడు ప్రభాస్‌తో ప్రేమలో పడిపోయిందని, ఇద్దరి మధ్య ఎఫైర్ ఉందనే కామెంట్స్ కూడా చేశారు.

దీంతో.. ఈ విషయంపై స్పందిస్తూ ఒక స్పెషల్ పోస్ట్‌ను షేర్ చేసింది. ‘నా టాటూపై ఇంత ఆసక్తి చూపిస్తుంటే నాకు నవ్వొస్తుంది.. ఇది దేని గురించో కనిపెడుతూ ఉండండి..’ అని రాసుకొచ్చింది. దీంతో నెటిజన్లు మరింత కన్‌ఫ్యూజన్‌లో పడిపోయారు. అసలు అమ్మడి ఉద్దేశ్యం ఏంటో అర్థం కాలేదని అంటున్నారు.

కానీ ప్రభాస్‌తో ఎఫైర్ అంటే, నవ్వొస్తుందని చెప్పకనే చెప్పేసింది. అయితే.. దిశా చెప్పినట్టే కొందరు PD అంటే, అర్థం ఏంటని ఆరా తీసే పనిలో ఉన్నారు. ఇకపోతే.. గతంలో టైగర్ ష్రాఫ్‌తో ప్రేమలో మునిగి తేలింది దిశా పటానీ. కానీ ఆ తర్వాత ఇద్దరు బ్రేకప్ చెప్పుకున్నట్టుగా టాక్ ఉంది. ప్రజెంట్.. సెర్బియన్ నటుడు అలెగ్జాండర్ అలెక్స్ ఇల్లిక్‌తో చెట్టపట్టాలేసుకుని తిరుగుతోందని బాలీవుడ్ వర్గాల మాట. అయితే.. ఎవరితో ప్రేమలో ఉన్నా కూడా.. సోషల్ మీడియాలో దిశా పటానీ హాట్ ట్రీట్ మాత్రం మామూలుగా ఉండదు.