పెద్ది టీజర్.. ఏదైనా ఈ భూమ్మీద ఉన్నపుడే సేసేయలి.. ఇది పెద్ది మాటహే..!
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా పెద్ది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు.

రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమా పెద్ది. శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఇది చూసిన తర్వాత సినిమా ఎలా ఉండబోతుందో ఒక క్లియర్ పిక్చర్ కళ్ళ ముందు కనిపించింది. రామ్ చరణ్ ను ఎంత విభిన్నంగా స్క్రీన్ మీద బుచ్చిబాబు ప్రజెంట్ చేస్తున్నాడు అనేది టీజర్ చూస్తుంటే అర్థమయిపోయింది. టీజర్ మొత్తం రా అండ్ రస్టిక్ గా ఉంది. ఈ సినిమా కోసం చరణ్ చాలా కష్టపడ్డాడు అని అర్థమవుతుంది. జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. బడ్జెట్ దగ్గర వెనకాడకుండా ఏ సినిమాలో నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. మొదటి సినిమా ఉప్పెనలో పూర్తి ప్రేమ కథ చూపించిన బుచ్చిబాబు.. ఈసారి స్టైల్ మార్చాడు. గురువు సుకుమార్ దారిలోకి వచ్చి ఒక అదిరిపోయే రూరల్ స్పోర్ట్స్ డ్రామా మన కళ్ళ ముందుకు తీసుకొస్తున్నాడు.
పెద్ది టీజర్ లో మరో మేజర్ హైలైట్ అందులోని బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇస్తున్నాడు. పెద్ది పెద్ది అంటూ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ రేంజ్ పెంచేసింది. పవర్ క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా వస్తుంది. ఒకే పని చేసేయడానికి.. ఒకేలాగే బతికేయడానికి ఇంత పెద్ద బతుకు ఎందుకు.. ఏదైనా ఈ భూమ్మీద ఉన్నప్పుడే సేసయ్యాలి.. అంటూ రామ్ చరణ్ చెప్తున్న డైలాగులు అదిరిపోయాయి. రేపు సినిమా విడుదలైన తర్వాత రంగస్థలం కూడా మరిచిపోయేలా పెద్ది సినిమా తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు. మేకోవర్ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకున్నాడు చరణ్. టీజర్ లో కథ పెద్దగా రివీల్ చేయలేదు. కానీ ఫ్రెండ్స్ అండ్ షాట్స్ మాత్రం అదిరిపోయాయి. ముఖ్యంగా రామ్ చరణ్ కనిపించిన ప్రతిసారి అదిరిపోయే ఫ్రేమ్ పెట్టాడు బుచ్చిబాబు.
టీజర్ చివర్లో వచ్చే ఒక షాట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. బ్యాట్ పట్టుకొని అలా ముందుకు వచ్చి ఒక షార్ట్ కొట్టడానికి ఇచ్చారని ఇచ్చిన ఎక్స్ప్రెషన్ అండ్ స్టైల్ అదిరిపోయాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్నా కూడా హైలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వస్తుంది ఈ సినిమా. అన్నింటికంటే అదిరిపోయే మ్యాటర్ ఏంటంటే.. 2026 రామ్ చరణ్ పుట్టిన రోజున ఈ సినిమా విడుదల కానుంది. మార్చి 27, 2026న సినిమా విడుదల చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు దర్శక నిర్మాతలు. దానికి ఒక్క రోజు ముందు నాని పారడైజ్ విడుదల కానుంది. అటు నాచురల్ స్టార్.. ఇటు గ్లోబల్ స్టార్ ఇద్దరి మధ్య బాక్సాఫీస్ వారు మాత్రం బాగానే ఉండబోతుంది అని అర్థమవుతుంది.