పీ..లింగ్స్ మారిపోయాయి… అలా పేలితే గాయాలు.?

పీలింగ్స్ పాట తూటాలా పేలిందంటూ పొగడ్తలొచ్చిన 24 గంట్లోలనే, సినీ జనాలు, నెటీజన్ల ఫీలింగ్స్ పూర్తిగా మారిపోయాయా? పుష్ప హిట్టైనంత తేలిక కాదు పుష్ప2 హిట్ అవటం అనంటున్నారు. దానికి కారణం ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవటమే...

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 3, 2024 | 02:04 PMLast Updated on: Dec 03, 2024 | 2:04 PM

Peelings Song Super Hit O Youtube

పీలింగ్స్ పాట తూటాలా పేలిందంటూ పొగడ్తలొచ్చిన 24 గంట్లోలనే, సినీ జనాలు, నెటీజన్ల ఫీలింగ్స్ పూర్తిగా మారిపోయాయా? పుష్ప హిట్టైనంత తేలిక కాదు పుష్ప2 హిట్ అవటం అనంటున్నారు. దానికి కారణం ఇది నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అవటమే… పుష్ఫ మొదటి భాగంలో హీరో ఒక్కడే, విలన్లు మాత్రం అరడజన్ పైనే.. కాని పుష్ప2 లో హీరో మాత్రం ఒక్కడు కాదట.. అదే ఇక్కడ తేడా కొట్టేలా ఉంది. అంటే అల్లు అర్జున్ కాకుండామరో హీరో ఇందులో చేశాడని కాదు.. కాని పార్ట్ 2 లో మాత్రం హీరో ఒక్కడు కాదు.. ఇదే పుష్ప 2 స్పెషాలిటీ… ఒకటి కాదు ఇలాంటి మూడు అంశాలు పుష్ప2 ని డౌట్ లోకి నెడుతోంది. పుష్ప హిట్ కాబట్టి, పార్ట్ 2 కూడా హిట్ అవటం కామన్… కాని అన్ని కలిసొచ్చినా మూడు విషయాల్లో ఏఒక్కడ తేడా కొట్టినా, అసలుకే ఎసరు వచ్చేలా ఉంది. సలార్, కల్కీ, దేవర రికార్డుల ఛాలెంజే ఈ సినిమాను ముంచేలా ఉంది. అదెలానో చూసేయండి.

పుష్ప తోపోలిస్తే పుష్ప2 సాంగ్స్ అంతగా మ్యాజిక్ చేయట్లేదు. టైటిల్ సాంగ్, సూసేకి పాటలు టూటాల్లా పేలాయి కాని, కిస్సిక్ పాట పేలలేదు… పీలింగ్స్ సాంగ్స్ లో డాన్స్ తప్ప ఇంకేంలేదు… ఈవిషయంలో దేవిశ్రీ ని ఫిల్మ్ టీం దూరం పెట్టాలనుకుంటోందన్న మాటకి కొంత సపోర్ట్, ఇంకొంత వ్యతిరేకత రావటంలో ఆశ్చర్యం ఏమి లేదు

ఇక పుష్ప హిట్ కాబట్టి, పుష్ప2 హిట్ అవటం మినిమం గ్యారెంటీ. ఏదో కథ మరీ ఘోరంగా ఉంటే చెప్పలేం కాని, 99 శాతం పుష్ప2 హిట్ కే ఛాన్సెస్ ఎక్కువ. తెలిసిన కథ, మాస్ ఫైట్లు, కలిసొచ్చిన సాంగ్స్ తో పాటు పుష్ప మూవీని చూసిన వాల్లలో 70, లేదంటే 80శాతం బ్యాచ్ ఖచ్చితంగా పుష్ప2ని చూసే అవకాశం ఉంది..

అంటే పుష్ప2 రిలీజ్ కిముందే హిట్ అయ్యిందనుకోవాలి.. అందుకే ఫిల్మ్ టీం ఫుల్ కాన్ఫిడెన్స్ తో టిక్కెట్ రేట్లు పెంచిన కోట్లు వెనకేసుకోవాలనుకుంటోందనే కామెంట్స్ పెరిగాయి. సరే ఈ విషయం పక్కన పెడితే, సలార్, కల్కీ, దేవర వల్ల ఎదరౌతున్న ఛాలెంజెస్ తో పాటు మరో మూడు డౌట్లు మాత్రం పుష్ప2 ని పూర్తిగా రిస్క్ లోకి నెడుతున్నాయి.

అందులో మొదటి డౌట్ పుష్ప వచ్చినప్పుడు ఆపాత్ర అందరికీ కొత్త కాబట్టి, పుష్ప2 చూసే జనాలకు ఆ క్యారెక్టర్ కొత్త అనిపించకపోవచ్చు. సోసీక్వెల్ లో ఏదో అదిరిపోయే ట్విస్ట్ ఉంటే తప్ప పుష్ప2 లో పుష్పరాజ్ ఎక్కటం అంత తేలిక కాదు

ఇక పుష్ప2 ముందున్న మరో ఛాలెంజ్ ఇందులో విలన్. ఫాహద్ ఫాజిల్, పుష్పలో కాసేపు కనిపించే రెండు డైలాగ్స్ తో వైరలయ్యాడు. ఇప్పుడు పుష్పీ2లో తనది ఫుల్ లెంథ్ రోల్ అంటే, అను గొప్ప నటుడవ్వటం వల్ల, తనే వెండితెరమీద డామినేట్ చేయొచ్చు.. అదే జరిగితే పుష్ప రాజ్ ఫైర్ కాదు ఫ్లవర్ అనే పరిస్థితులొస్తాయి.. సుకుమార్ అంతఘోరంగా పాత్రలను తక్కువ చేస్తాడని కాదు, కాని కొన్ని సార్లు చెప్పలేం..

ఇక పుష్పీ2 ముందున్న మూడో ఛాలెంజ్ జపాన్,చైనాకు షిఫ్ట్ అయ్యే కథ… అదే కలిసొస్తుందా అన్న డౌట్లున్నాయి. ఎందుకంటే, ఎర్ర చెందనం ఎంత రేర్ వుడ్డైనా, జపాన్, చైనాలో మంచి గిరాకీ ఉన్నా, ఇదేం డ్రగ్ కాదు, బంగారం, వజ్రాలను మించే సరుకు కాదు.. కాబట్టి జపాన్,చైనాలో ఈ కర్రకోసం మనదగ్గర కొట్టుకు చచ్చినట్టు అంత సీన్ ఉండదు.. వాళ్లు పెట్టే కోట్లు ఇక్కడ గొప్ప కాని, ఆ దేశాల్లో సంపద పరంగా ఇది నథింగ్. కాబట్టి ఈ కర్రలకోసం అక్కడి జనం ఇక్కడ హీరోతో ఫైట్ చేసే సీన్లు ఎక్కుతాయా అన్న డౌట్లు పెరిగాయి. ఇవన్నీ నిజంగా పుష్ప2 ని డ్యామేజ్ చేసే ఛాలెంజులే కాకపోయినా, కొన్నిసార్లు చిన్న అంశాలే అద్రుష్టాన్ని మారుస్తాయి.. లేదంటే అరిష్టంగా మారిపోతాయి… దీనికి తోడు సలార్, కల్కీ, దేవర రికార్డులని ఏమాత్రం పుష్ప 2 రీచ్ కాకున్న, రెండు మూడు రోజుల్లో సీన్ మారిపోతుంది.. అసులుకే ఎసరొస్తుంది.