ఏమున్నాడ్రా బాబు.. సూట్ లో వైరల్ అవుతున్న ఎన్టీఆర్ ఫొటోస్..!

మిర్చి సినిమాలో కార్ లోంచి దిగుతున్న ప్రభాస్ ని చూసి ఏమున్నాడ్రా బాబు అంటూ అనుష్క ఒక డైలాగ్ ఉంటది కదా..! ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2025 | 12:10 PMLast Updated on: Feb 24, 2025 | 12:10 PM

Photos Of Ntr Going Viral In Suit

మిర్చి సినిమాలో కార్ లోంచి దిగుతున్న ప్రభాస్ ని చూసి ఏమున్నాడ్రా బాబు అంటూ అనుష్క ఒక డైలాగ్ ఉంటది కదా..! ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని చూస్తుంటే కూడా ఇదే అనిపిస్తుంది. దుబాయిలో ఈయన కుటుంబంతో కలిసి ఒక పెళ్ళికి వెళ్ళాడు. ఎన్టీఆర్ తో పాటు చిరంజీవి, మహేష్ బాబు కుటుంబాలు కూడా ఈ పెళ్లికి వచ్చాయి. అంతేకాదు పెళ్లి తర్వాత అందరూ కలిసి ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి స్టేడియంకు వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ దుబాయ్ లో ఉన్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. ఆయన న్యూ లుక్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.

ప్రస్తుతం వార్ 2 సినిమాతో బిజీగా ఉన్నాడు జూనియర్. ఈ సినిమా లుక్ లోనే బయటికి వస్తున్నాడు ఆయన. ఈ క్రమంలోనే దుబాయిలో పెళ్లి సమయంలోనే ఫోటోషూట్ చేశాడు తారక్. బ్లాక్ సూట్ లో జూనియర్ ని చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. మావాడు చూడండ్రా ఎలా ఉన్నాడు.. అచ్చం సింహంలా ఉన్నాడుగా అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దేవర సక్సెస్ తర్వాత తన ఫోకస్ మొత్తం వార్ సినిమా పైన పెట్టాడు జూనియర్ ఎన్టీఆర్. ఇది ఆగస్టులో విడుదల కానుంది. దీని విడుదలకు ముందే ప్రశాంత్ నీల్ సినిమా మొదలుపెట్టాడు. 2026 సంక్రాంతికి విడుదల కానుంది.

ఈ సినిమా దీని తర్వాత దేవర 2 లైన్లో ఉంది. మొత్తానికి ఇటు సినిమాలతో అటు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటో షూట్లతో అభిమానులకు ఎప్పటికప్పుడు ఆనందాన్నిస్తూనే ఉన్నాడు జూనియర్. త్వరలోనే ప్రత్యేకంగా ఫ్యాన్స్ మీట్ కూడా ఏర్పాటు చేస్తానని ఈ మధ్య ఒక లెటర్ కూడా రిలీజ్ చేశాడు.