Project K Movie: ప్రాజెక్ట్-K నుంచి ఫొటోలు లీక్..
చిన్నా పెద్దా లేకుండా ప్రతీ సినిమాకు ఉండే కామన్ ప్రాబ్లం లీక్స్. ప్రాజెక్ట్ షూటింగ్ జరుగుతున్న సమయంలో సినిమా నుంచి లీకయ్యే ఫొటోలు, వీడియోలు మేకర్స్‌కు పెద్ద తలనొప్పిగా మారుతాయి.

Photos of Prabhas' Deepika Padukone-starrer Project K starring Amitabh in the lead role have been leaked.
ఎంతో గ్రాండ్‌గా డిజైన్ చేసిన చాలా క్యారెక్టర్స్ విషయంలో ఈ లీక్‌ల కారణంగా ఆడియన్సకు కిక్కు లేకుండా చేశాయి. ఇప్పుడు ఇదే ప్రాబ్లం ప్రాజెక్ట్-కే సినిమాను కూడా వెంటాడుతోంది. సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ప్రాజెక్ట్ కే సినిమా నుంచి అమితాబ్ బచ్చన్ ఫొటో ఒకటి లీకయ్యింది. అయితాబ్ పొడువాటి జుట్టుతో స్వామీజీలా ఉన్న ఫొటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. 5 వందల కోట్ల భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో దీపికా హీరోయిన్‌గా నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ ఓ కీ రోల్ ప్లే చేస్తున్నారు.
ఈ సినిమాలో ఆయన దేవుడి రోల్ చేయబోతున్నాడంటూ చాలా రోజుల నుంచి టాక్ నడుస్తోంది. ఇప్పుడు లీకైన ఆయన లుక్ కూడా దాదాపు అలాగే ఉండటంతో ఆయన దేవుడి రోల్‌లో కనిపించబోతున్నాడనే విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ ఫొటోతో సినిమా మీద బజ్ క్రియేట్ అయ్యింది. అమితాబ్ లుక్ ఇంత గ్రాండ్‌గా ఉంటే ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతోందా అని ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. రీసెంట్‌గా ఆదిపురుష్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ మిక్స్‌డ్ టాక్‌తో ఎటూ తేల్చుకోలేని పొజిషన్‌లో ఉన్నాడు. దీంతో ఇప్పుడు ప్రభాస్‌కు సలార్, ప్రాజెక్ట్-కే చాలా ఇంపార్టెంట్‌గా మారిపోయాయి.