iBomma: టాలీవుడ్‌కు ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్.. ఇండస్ట్రీకి షాకిచ్చిందిగా..!
కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే క్వాలిటీ ప్రింట్‌ను ఐబొమ్మలో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సైట్‌పై చాలా గొడవలు జరుగుతున్నా.. ఐబొమ్మ నిర్వాహకులు స్పందించడం లేదు. ఐతే ఇప్పుడు మాత్రం రెచ్చిపోయారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తూ.. ఐబొమ్మ నిర్వాహకులు పెద్ద పోస్ట్ పెట్టారు.
iBomma: తెలుగు సినిమా ప్రేక్షకులకు ఐబొమ్మ వెబ్‌సైట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఐబొమ్మను పేదవాడి ఓటీటీ అంటారు నెటిజన్లు. కొత్తగా వచ్చిన సినిమాలు ఓటీటీలో విడుదలైన ఒక్కరోజులోనే పైసా ఖర్చు లేకుండా ఈ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన వెంటనే క్వాలిటీ ప్రింట్‌ను ఐబొమ్మలో పెట్టేస్తూ ఉంటారు. అయితే ఈ సైట్‌పై చాలా గొడవలు జరుగుతున్నా.. ఐబొమ్మ నిర్వాహకులు స్పందించడం లేదు. ఐతే ఇప్పుడు మాత్రం రెచ్చిపోయారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి వార్నింగ్ ఇస్తూ.. ఐబొమ్మ నిర్వాహకులు పెద్ద పోస్ట్ పెట్టారు. ఐ బొమ్మ మీద మీరు ఫోకస్ చేస్తే.. మేము ఎక్కడ ఫోకస్ చేయాలో అక్కడ చేస్తాం. డిస్ట్రిబ్యూటర్స్‌కు ప్రింట్ అమ్మిన తర్వాత.. కెమెరా ప్రింట్స్ తీసిన వాళ్ల మీద కాకుండా మీ ఓటీటీ రెవెన్యూ కోసం ఆలోచిస్తూ మా మీద ఫోకస్ పెట్టారు.
హీరోలకు అంత రెమ్యూనరేషన్ అవసరమా..? అది మీ కొడుకులైనా.. ఎవరైనా కావచ్చు. సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. వాళ్లు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్లకు మీరు ఇచ్చే డబ్బులు, బయట ఏ కూలి పని చేసినా వస్తాయి. కానీ మీ హీరో, హీరోయిన్లకు వస్తాయా అంటూ ప్రశ్నించారు ఆ నోట్‌లో. సినిమా బడ్జెట్‌లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్స్, విదేశాల్లో షూటింగ్‌లకు, యాత్రల కోసం ఖర్చుపెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు..? ఇండియాలో షూటింగ్ చేస్తే బడ్జెట్ తగ్గుతుంది కదా..? ఇక్కడ వాళ్లకు ఉపాధి దొరుకుతుంది కదా..? అనవసర బడ్జెట్ పెట్టి, ఆ బడ్జెట్ రికవరీకి దాన్ని మా మీద రుద్ది ఎక్కువకు అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్‌ను కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్య తరగతి వాడే బాధపడుతున్నాడు. అందుకే ఫస్ట్ కెమెరా ప్రింట్స్ రిలీజ్ చేసే వెబ్‌సైట్ మీద మీ దృష్టి పెట్టండి.
ఐబొమ్మ అన్నది సిగరేట్ నుంచి.. ఈ సిగరెట్‌కు యూజర్స్‌ని మళ్లించే ప్రక్రియ. మీ యాక్షన్‌కు మా రియాక్షన్ ఉంటుంది. ఈ మధ్యలో వేరే హీరో కూడా టార్గెట్ కావడం ఇష్టం లేదు. మేము స్వతహాగా వెబ్‌సైట్ నుంచి తొలిగిస్తున్నాం. ఇప్పుడు వెంటనే డిలీట్ చేస్తే మీకు భయపడి లేదా మీరు ప్రభావం చూపించినట్లు ఉంటుంది. అందుకే ఈ పోస్ట్ చేసిన కొన్ని గంటల తర్వాత తీసేయ్యాలి అనుకుంటున్నాం. మా వెబ్‌సైటు మీద ఫోకస్ చేయడం ఆపండి. లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సివస్తుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.