NTR : ఎన్టీఆర్ పై విష ప్రచారం
ఈ సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్ వార్స్ బాగా పెరిగిపోయాయి. హీరోల అభిమానులు ఒకరి మీద ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ సోషల్ మీడియా యుగంలో ఫ్యాన్ వార్స్ బాగా పెరిగిపోయాయి. హీరోల అభిమానులు ఒకరి మీద ఒకరు హద్దు మీరి విమర్శలు చేసుకుంటున్నారు. కొందరైతే కుటుంబంలోని ఆడవారిని కూడా ఈ అనవసరపు గొడవల్లోకి లాగి.. చీప్ కామెంట్స్ చేయడం చూస్తున్నాం. అభిమానులను కంట్రోల్ లో ఉండమని బుద్ధి చెప్పాల్సిన హీరోలు సైతం.. ఈ విషయంలో ఏం చేయలేకపోతున్నారు. ఇంకా కొందరు హీరోలైతే ఇలాంటి కల్చర్ ని కావాలని ఎంకరేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి.
తన మీద, తన సినిమాల మీద నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తున్నారని ఈమధ్య పలువురు హీరోలు వాపోయిన సంఘటనలు చూశాం. కొందరు హీరోలు కావాలనే.. తమకి పోటీగా ఉన్న ఇతర హీరోలపై నెగటివ్ ప్రచారం చేస్తున్నారనే అభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాల్లో ఉన్నాయి. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని.. అలాగే ఒక హీరో టీం టార్గెట్ చేసిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ట్విట్టర్ రీచ్ పరంగా టాప్ లో ఉండే హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయన ఏ ట్వీట్ చేసినా.. రీచ్ ఓ రేంజ్ లో ఉంటుంది. ఇటీవల ‘దేవర’ (Devara) ఫస్ట్ సింగిల్ ‘ఫియర్ సాంగ్’ (Fear Song) ప్రోమోని ఎన్టీఆర్ ట్విట్టర్ లో షేర్ చేయగా.. ఏకంగా 6 మిలియన్ రీచ్ వచ్చింది. అలాగే లైక్స్ కూడా లక్షకి పైగా వచ్చాయి. అయితే ఈ లైక్స్ ఉన్నట్టుండి ఒక్కసారిగా సగానికి పైగా పడిపోవడం షాకింగ్ గా మారింది. దీని వెనుక బడా ఫ్యామిలీకి చెందిన ఒక హీరో పీఆర్ టీం హస్తముందని.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు. బాట్స్ ద్వారా లైక్స్ కొట్టి, మళ్ళీ వాటిని తొలగించి.. ఎన్టీఆర్ ది ఫేక్ రీచ్ అని ప్రచారం చేయడమే వాళ్ళ ఉద్దేశమని అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తో ఎన్టీఆర్ కి గ్లోబల్ రీచ్ రావడం, బాలీవుడ్ నుంచి బిగ్ ఆఫర్స్ వస్తుండటం, దేవర ‘ఫియర్ సాంగ్’కి హిందీలో సూపర్ రెస్పాన్స్ రావడం.. ఇలాంటివన్నీ చూసి తట్టుకోలేక ఎన్టీఆర్ పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తున్నారని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. హీరోల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి కానీ.. ఇలా ఒకరి మీద మరొకరు నెగటివ్ క్యాంపెయిన్ చేసుకోవడం కరెక్ట్ కాదని హితవు పలుకుతున్నారు. ఏది ఏమైనా ప్రస్తుతం ఈ వివాదం సోషల్ మీడియాని షేక్ చేస్తోంది.