ఆ ఇద్దరు డైరెక్టర్స్ పూజకి యెందుకు హ్యాండ్ ఇచ్చారు? తెర వెనుక ఏం జరిగింది?
పూజా హెగ్డే.. టాలీవుడ్ లో మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. ఎవరు ఆఫర్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా త్రివిక్రమ్, హరీష్ శంకర్ ఈ లేడీని తీసుకునేవారు. గ్లామర్ డాల్ గా ఫోకస్ చేసేవారు. కట్ చేస్తే ఇప్పుడీ ఇద్దరు దర్శకులు పూజా హెగ్డేకి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

Pooja Hedde missed the opportunity to act with Mahesh Babu and Pawan Kalyan
పూజా హెగ్డే.. టాలీవుడ్ లో మొన్నటి వరకు ఫుల్ స్వింగ్ లో ఉన్న బ్యూటీ. ఎవరు ఆఫర్స్ ఇచ్చిన ఇవ్వకపోయినా త్రివిక్రమ్, హరీష్ శంకర్ ఈ లేడీని తీసుకునేవారు. గ్లామర్ డాల్ గా ఫోకస్ చేసేవారు. కట్ చేస్తే ఇప్పుడీ ఇద్దరు దర్శకులు పూజా హెగ్డేకి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మహేష్, త్రివిక్రమ్ కాంబోలో గుంటూరు కారం ఫిక్స్ అయ్యింది.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇందులో మొదట పూజా హెగ్డే ని హీరోయిన్ గా ఫిక్స్ చేశారు. కొంత షూట్ కూడా చేశారు.కానీ తర్వాత ఏం జరిగిందో ఏమో ఈ ప్రాజెక్ట్ నుంచి పూజా తప్పుకుంది. ఆమె తప్పుకుందా, యూనిట్ తప్పించిందా అనేది వేరే విషయం. త్రివిక్రమ్ సినిమాలో పూజా లేదనేది పెద్ద షాకింగ్ మ్యాటర్. ఇప్పుడు హారీష్ శంకర్ కూడా ఈ బ్యూటీకి హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
పవన్ తో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చేస్తున్నాడు హరీష్ శంకర్. హీరోయిన్ గా పూజా పేరు ఫైనల్ అయినట్లు ప్రచారం జరిగింది. కట్ చేస్తే తాజాగా సాక్షి వైద్య ని ఈ ప్రాజెక్ట్ లోకి ఏంట్రీ ఇచ్చింది. దీంతో పవన్ సినిమాలో పూజా హెగ్డేకు చోటు లేదనే విషయం తేలియపోయింది. ఈ సినిమాలో ఫస్ట్ హీరోయిన్ గా శ్రీలీల, సెకండ్ హీరోయిన్ గా సాక్షి వైద్య కనిపించనున్నారు.
గుంటూరు కారం సినిమా నుంచి పూజాహెగ్డే తప్పుకోవడానికి దర్శకుడిపై మహేష్ బాబు ఒత్తిడి ప్రధాన కారణం అని కామెంట్స్ వినిపించాయి. మరి ఉస్తాద్ నుంచి పూజా ని తప్పించడానికి కారణం ఏంటనేది ప్రస్తుతానికి సస్పెన్స్. దర్శకుల సెంటిమెంట్స్ సంగతి పక్కనపెడితే ఇటు మహేష్.. అటు పవన్ కళ్యాణ్ లాంటి ఇద్దరు బడా హీరోల సినిమాల్ని పూజా హెగ్డే మిస్ చేసుకోవడం తన కెరీర్ కి పెద్ద ఎదురు దెబ్బే.