Pooja Hegde: సినిమా ఆఫర్లు లేకున్నా కార్లు కొనేస్తున్న హీరోయిన్లు..!
చేతిలో సింగిల్ సినిమాలేదు. ఐరన్ లెగ్‌గా పడ్డ మచ్చ పోవట్లేదు. అయినా కారు కోసం రూ.4 కోట్లు పైనే ఖర్చు చేసి వార్తల్లోకెక్కింది. విచిత్రం ఏంటంటే టాలీవుడ్‌లో పూజా హెగ్డేకి ఎలా అయితే పనిలేదో, బాలీవుడ్‌లో ఇలానే శ్రద్దాకపూర్‌కి సినిమా అవకాశాల్లేవు.
Pooja Hegde: పూజా హెగ్డే తాజాగా కొన్న రేంజ్ రోవర్ కొత్త వర్షన్ ఖరీదు రూ.4.25 కోట్లు. ఇంత ఖర్చు పెట్టి రెండో రేంజ్ రోవర్ తీసుకుంది ఈ లేడీ. గతంలో బీఎండబ్ల్యూని రూ.1.80 కోట్లు పెట్టి కొన్న పూజా అప్పుడంటే టాప్ హీరోయిన్‌గా దూసుకెళుతోంది కాబట్టి ఓకే అనుకోవచ్చు. కానీ, ఇప్పుడు చేతిలో సింగిల్ సినిమాలేదు. ఐరన్ లెగ్‌గా పడ్డ మచ్చ పోవట్లేదు.
అయినా కారు కోసం రూ.4 కోట్లు పైనే ఖర్చు చేసి వార్తల్లోకెక్కింది. విచిత్రం ఏంటంటే టాలీవుడ్‌లో పూజా హెగ్డేకి ఎలా అయితే పనిలేదో, బాలీవుడ్‌లో ఇలానే శ్రద్దాకపూర్‌కి సినిమా అవకాశాల్లేవు. తన కెరీర్‌లో సాహోనే భారీ బడ్జెట్ మూవీ. అలాంటి ఈ హీరోయిన్ కూడా మొన్నటికి మొన్న రూ.4.8 కోట్ల ఖర్చు చేసి లాంబోర్గిని కారు కొనే, వార్తల్లో నిలిచింది. తిండానికి తిండిలేదు కాని మీసాలకు సంపెంగ నూనే అన్నట్టు.. సింగిల్ ఆఫర్ లేకున్నా కోట్లు తగలేసి హీరోయిన్లు కార్లు కొంటున్నారని కొంతమంది అసూయ బ్యాచ్ ట్రోలింగ్ పెంచారు. ఐతే సమంత ఆదాయం చూశాకే హీరోయిన్లు సినిమాలు చేయకున్నా కోట్లొస్తాయనే క్లారిటీ వస్తోంది. నిజమే.. సమంత సినిమాలకు బ్రేక్ వేసింది. మయోసైటిస్‌తో పోరాడుతోంది.
అయినా తన ఆదాయం తగ్గకపోగా పెరిగింది. సోషల్ మీడియాలో పేయిడ్ యాడ్స్ ఇవ్వటం, బ్రాండ్ అంబాసిడర్‌గా ఇంకా తనకు రెవెన్యూ రావటం, అలానే బట్టల కంపెనీ తాలూకు లాభాలు.. ఇవన్నీ కలిపి తను సినిమాలు చేయకున్నా కోట్లు కొల్లగొట్టేలా చేస్తున్నాయి. అచ్చంగా పూజా, శ్రద్దా కూడా ఇన్‌స్టాగ్రామ్‌తోపాటు యాడ్స్‌తోనే ఎక్కువ వెనకేస్తున్నారట.