Pooja Hegde: ఒకే ఒక్కడి మీద అన్ని ఆశలు పెట్టుకున్న పూజా

హిందీలో హౌజ్ ఫుల్ 4 తప్ప మరో హిట్ లేని తను మొత్తానికి ఇప్పుడు హిందీ మూవీ దేవాతో దూకుడు పెంచే పనిలో ఉంది. ఫస్ట్ టైం హాఫ్ న్యూడ్ సీన్ చేసిందట. హిందీ హీరో షాహిద్ కపూర్‌తో జోడీ కట్టి, దేవా మూవీ చేస్తున్న పూజా హెగ్డే ఇందులో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చేలా ఉంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 24, 2024 | 05:41 PMLast Updated on: Feb 24, 2024 | 5:41 PM

Pooja Hegde Doing Intimacy Secne In Shahid Kapoor Deva

Pooja Hegde: పూజా హెగ్డే ఏం చేసినా, ఏ మూవీలో మెరిసినా పంచ్ పడింది. ఐదారు వరుస ప్లాపుల తర్వాత తన అడ్రస్ గల్లంతైంది. అందం, అభినయం ఉన్నా, ఐదారు బ్లాక్ బస్టర్ల చరిత్ర ఉన్నా, ఈ లేడీ పేరు చెబితే పెద్ద హీరోలంతా జంప్ అవుతున్నారు. ప్రభాస్, మహేశ్, చరణ్, తారక్, బన్నీ అందరితో జోడీ కట్టింది. పాన్ ఇండియా ట్రెండ్ షురూ అయిన టైంలో అడ్రస్ లేకుండా పోయింది.

Ram Charan: మెగా అభిమానులు బీ రెడీ.. గేమ్ చేంజర్ టీజర్ డేట్ ఫిక్స్

హిందీలో హౌజ్ ఫుల్ 4 తప్ప మరో హిట్ లేని తను మొత్తానికి ఇప్పుడు హిందీ మూవీ దేవాతో దూకుడు పెంచే పనిలో ఉంది. ఫస్ట్ టైం హాఫ్ న్యూడ్ సీన్ చేసిందట. హిందీ హీరో షాహిద్ కపూర్‌తో జోడీ కట్టి, దేవా మూవీ చేస్తున్న పూజా హెగ్డే ఇందులో అందాలు ఆరబోసి షాక్ ఇచ్చేలా ఉంది. ఆఫర్ల కోసమో, సెన్సేషన్ కోసమో, లేదంటే స్క్రిప్ట్ డిమాండ్ చేసిందో కాని, మొత్తానికి హాలీవుడ్ హీరోయిన్ రేంజ్‌లో హాట్ సీన్‌తో సెగలు రేపే పనిలో ఉందట.

హిందీ మూవీ రెయిడ్‌లో ఇలియానా కూడా హీరోని టాప్ లేకుండా హగ్ చేసుకునే సీన్‌తో అప్పట్లో వివాదానికి, కామెంట్లకి కారణమైంది. అలాంటి సీనే దేవా మూవీలో షాహిద్ కపూర్‌తో పూజా నటించిందని తెలుస్తోంది. కబీర్ సింగ్ హిట్ తర్వాత సాలిడ్ సక్సెస్ కోసం షాహిద్ కపూర్ కూడా దూకుడు పెంచేస్తున్నాడు. ఇలా ఈ ఇద్దరూ ఫ్యూచర్ కోసం రొమాంటిక్ షాక్ ఇచ్చే పనిలో ఉన్నారు.