Puja Hegde: సచ్చినోడికి వచ్చిందే కట్నం..
ప్లాపుల్లో మునిగి తేలిన భామ పూజాకు అవకాశాలు వెల్లువలా వస్తున్నాయి. అదెలాగో ఇప్పుడు చూద్దాం.

Pooja Hegde gets second innings chance to act with hero Nikhil in Karthikeya 3
టాలీవుడ్ లో పెద్ద హీరోలు, కోలీవుడ్ లో మొత్తం కథానాయకులు పూర్తిగా పూజా హెగ్డేని పక్కపెట్టేశారు. కట్ చేస్తే ఐటమ్ సాంగ్స్ లేదంటే బాలీవుడ్ లో ఏవో ఆఫర్స్ ఉన్నాయంటూ, చిన్నా చితకా యాడ్స్ చేసొచ్చి, కాలం వెళ్లదీస్తోంది పూజా హెగ్డే. సౌత్, నార్త్ లో వచ్చిన వరుస ప్లాపులు, తెలుగులో పెద్ద హీరోలు తనని తీసేయడాలు.. వీటితో డీలా పడ్డ తనకి ఇప్పడు కాలం మరోలా కలిసొస్తోంది.
ఇంకో ఆప్షన్ దొరికినట్టైంది. మీడియం రేంజ్ హీరోల సినిమాలకు పూజా హెగ్డే కేరాఫ్ అడ్రస్ అవుతోంది. నితిన్, శర్వానంద్, నిఖిల్ లాంటి హీరోలకు పూజా హెగ్డే మంచి ఆప్షన్.. నిఖిల్ చేసే కార్తికేయ 2 సీక్వెల్ కార్తికేయ 3 కి పూజా ని సంప్రదించారట. కారణం పూజాకి ఛాన్స్ లేకపోవటం, 4 కోట్ల తన రెమ్యునరేషన్ ని కోటికి తగ్గించుకోవాటంతో తను మంచి ఆప్షన గా మారింది.
గ్లామర్ డాల్ గా తనకి ఉన్న లుక్కు, అలానే నార్త్ లో కూడా తనకి ఉన్న గుర్తింపు నిఖిల్ మూవీకి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో షోరూమ్ వేహికిల్ చిన్న యాక్సిడెంట్ తో సెకండ్ హ్యాండ్ రేటు పడిపోయినట్టు, ఈజీగా పూజా హెగ్డే కాల్ షీట్లు మీడియం రేంజ్ హీరోలకు దొరుకుతున్నాయట. అలానే మీడియం రేంజ్ హీరోల మూవీల్లో హీరోయిన్ కి ప్రయారిటీ ఎక్కువుండటం వల్ల మరో బ్రేక్ వస్తే, ఫేట్ మారుతుందని పూజా కూడా ఒప్పేసుకుంటోందట.