Pooja Hegde: రెబల్ స్టార్ కరుణించాడు.. లక్కీ పూజా..
మీడియం రేంజ్ మూవీలే తప్ప పెద్ద హీరోలతో జోడీ కష్టం అన్నారు. కాని ఏం మంత్రమేసిందో కాని రెబల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు అందరినీ ఈ బుట్ట బొమ్మ బుట్టలో పడేస్తోంది. రెబల్ స్టార్‌తో మారుతి తీస్తున్న ది రాజా సాబ్‌లో ఆఫర్ పట్టింది.

Pooja Hegde: పూజా హెగ్డే కెరీర్ బిగినింగ్‌లో ఐరన్ లెగ్ అన్నారు. తర్వాత వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ అయింది. ఇప్పుడు అర డజన్ ఫ్లాపులతో మళ్లీ ఐరన్ లెగ్‌గా మారింది. ఏదేమైనా ప్రభాస్‌కి తన వల్ల పంచ్ పడింది. సల్మాన్ నుంచి రామ్ చరణ్, రణ్‌వీర్ సింగ్ వరకు తను ఎవ్వరికీ కలిసిరాలేదనిపించుకుంది. దీంతో అందరూ తనని దూరం పెట్టారు. ఏదో నాగచైతన్యతో ఓ చిన్న సినిమా చేయబోతోందంటున్నారు.
Lokesh Kanagaraj: గ్యాంగ్‌స్టర్‌గా రజినీ.. సినిమా బ్యాక్‌డ్రాప్ మామూలుగా లేదుగా..!
అలాంటి మీడియం రేంజ్ మూవీలే తప్ప పెద్ద హీరోలతో జోడీ కష్టం అన్నారు. కాని ఏం మంత్రమేసిందో కాని రెబల్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు అందరినీ ఈ బుట్ట బొమ్మ బుట్టలో పడేస్తోంది. రెబల్ స్టార్‌తో మారుతి తీస్తున్న ది రాజా సాబ్‌లో ఆఫర్ పట్టింది. ఆల్రెడీ అందులో ముగ్గురు హీరోయిన్లు ఉండగా, సగం షూటింగ్ తీశాక పూజాని ఎలా తీసుకుంటారనే డౌట్లే వద్దు. ఇందులో గెస్ట్ రోల్‌తో పాటు ఓ ఐటమ్ సాంగ్ ఈ లేడీ మీదే ప్లాన్ చేశారు. అంతా డార్లింగ్ ప్రభాస్ దయే అని తెలుస్తోంది.
అంతెందుకు.. అట్లీ మేకింగ్‌లో బన్నీ చేయబోయే సినిమాలో కూడా పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట. ఇక్కడ కూడా బన్నీతో ఉన్న కాంటాక్ట్స్‌ని వాడి, అలా పూజా ఈ ఆఫర్ పట్టేసిందని తెలుస్తోంది. మొత్తానికి ఎఫ్3లో ఐటమ్ బాంబ్ పేల్చినప్పటి నుంచి అదే రూట్లో కెరీర్‌ని కొత్తగా మలచుకునే పనిలో పడింది పూజా హెగ్డే.