Devara : దేవర’ ఐటెం సాంగ్‌లో పూజా హెగ్డే…

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వస్తున్న దేవర (Devara) సినిమా పై భారీ అంచనాలున్నాయి.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: April 19, 2024 | 10:23 AMLast Updated on: Apr 19, 2024 | 10:23 AM

Pooja Hegde In Devara Item Song

 

 

 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్లో వస్తున్న దేవర (Devara) సినిమా పై భారీ అంచనాలున్నాయి. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ ఐటెం సాంగ్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సముద్రం బ్యాక్ డ్రాప్‌లో హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్‌ 10న దేవర ఆడియెన్స్ ముందుకురానుంది. ఇప్పటికే బిజినెస్ డీల్ క్లోజ్ చేసే పనిలో ఉన్నారు మేకర్స్. ఓవరాల్‌గా ఈ సినిమాకు 400 కోట్ల బిజినెస్ జరిగినట్టుగా సమాచారం. అయితే.. ఈ సినిమాలో ఐటెం సాంగ్ ఉందా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. ఐటెం సాంగ్ ఉండే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అంతేకాదు.. బుట్టబొమ్మ పూజా హెగ్డే దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి సై అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. గతంలో ఎన్టీఆర్ సరసన అరవింద సమేతలో హీరోయిన్‌గా నటించింది పూజా. కానీ ప్రస్తుతం పూజాకు తెలుగులో ఒక్క ఆఫర్ కూడా లేదు. వరుస ఫ్లాపుల కారణంగా పూజాను మేకర్స్ ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకె చెప్పినట్టుగా చెబుతున్నారు. గతంలో ఒకటి రెండు సినిమాల్లో ఐటెం బ్యూటీగా చిందేసింది పూజా.
ఇక ఇప్పుడు ఎన్టీఆర్‌తో స్టెప్పులేయడానికి రెడీ అవుతోందట. దేవర సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. దీంతో అదిరిపోయే మ్యూజిక్ ఇస్తాడనే నమ్మకంతో ఉన్నారు నందమూరి ఫ్యాన్స్. అనిరుధ్ ట్యూన్‌కు, ఎన్టీఆర్ స్టెప్పులకు థియేటర్లు షేక్ అవడం పక్కా అంటున్నారు. ఇక ఐటెం సాంగ్ అంటే.. ఆ రచ్చ ఎలా ఉంటుందో ఊహించుకోండి. మరి దేవర ఐటెం సాంగ్‌లో ఎంతరకు నిజముందో తెలియాల్సి ఉంది.