Pawan Kalyan: పవన్ ని కాదని ఫోజు కొట్టింది.. అడ్రస్ లేకుండా పోయింది..
పూజా హెగ్డే 2020 వరకు ఈ లేడీకి ఎదురు లేదు. కాని రెండేళ్ల తర్వాత తన అడ్రస్ గల్లంతు.. 6 నెల్ల క్రితం పవన్ మూవీకి సైన్ చేసిన తను, పవర్ స్టార్ తో హరీష్ శంకర్ చేయాల్సిన మూవీ డిలే అవుతోందని, ప్రాజెక్ట్ నుంచి పక్కకు తప్పుకుంది.. కాని ఏమైంది.. ఇప్పుడు తను పూర్తిగా కాలీగా ఉండాల్సి వస్తోంది.

Pooja Hegde lost Chance Act with pawan kalyan
5 ఫ్లాపుల తర్వాత తనకి తెలుగు, తమిల్ నుంచి సింగిల్ ఆఫర్ పోలేదు. ఏదో గతంలో త్రివిక్రమ్ ఇచ్చిన ఆఫర్ వల్లే మహేశ్ మూవీ చేస్తోందనుకుంటే, అది కూడా కథ రిపేర్ల కారణంగా ఆగింది. హిందీలో లక్కీగా షాహిద్ కపూర్ తో జోడీకట్టే ఛాన్స్ వచ్చినా అది దసరాకే షూటింగ్ అంటున్నారు.
సో చేస్తున్నసినిమా షూటింగ్ ఆగింది, చేయాల్సిన మూవీ ఎప్పుడో గాని తెరకెక్కందు. అలా చూస్తే లాస్ట్ ఇయర్ వరకు చాలా బిజీగా గడిపిన టాలీవుడ్ టాప్ హీరోయిన్ పూజా , ప్రజెంట్ ఖాళీ.. అనవసరంగా పవన్ ప్రాజెక్ట్ ఉస్తాధ్ భగత్ సింగ్ ని వదులుకుంది.. కనీసం ఆ ప్రాజెక్ట్ చేతిలో ఉన్నా, తనిప్పుడు బిజీ గా ఉండేది.. హరీష్ శంకర్ మేకింగ్ లో తనకి డీజే తో కలిసొచ్చింది కాబట్టి, పవర్ ఫుల్ స్టార్ తోజోడీకట్టుంటే, కలిసొచ్చేదనే మాటే వినిపిస్తోంది. ఏదేమైనా పవర్ స్టార్ ఆఫర్ కాదన్నందకు ఇప్పుడు తను బాధపడుతోందట. మళ్లీ హరీష్ శంకర్ ని అప్రోచ్ అయ్యిందట.