Sri Leela: ఆడవాళ్లకు ఆడవాళ్ళే శత్రువు.. ముగ్గురికి మూడింది..
ఆడవాళ్లకి ఆడవాళ్లే శత్రువంటారు. అంది వందకు వందపాళ్లు నిజమని ప్రూవ్ చేస్తోంది శ్రీలీలా... ఒక్కరు కాదు ఇద్దరు కాదు, ముగ్గురి జీవితాలతో ఓ ఆటాడేసుకుంటోంది. సొంతూరు వాళ్లే అనే కనికరం కూడా చూపించట్లేదీ లేడీ..

Pooja Hegde, Rashmika Mandana and Kriti Shetty are not getting opportunities since Srileela entered the Telugu film industry
శ్రీలీలా వల్ల ఇప్పుడు ముగ్గురు హీరోయిన్ల కెరీరే స్పాయిల్ అవుతోంది. ఈ హీరోయిన్ నవ్వు వెనక విషం కంటే భయంకరమైన నిజం దాగుందంటున్నారు. అదే తోటి కన్నడ హీరోయిన్లు అన్న కనికరం కూడా చూపించకుండా, శ్రీలీలా ముగ్గురు హీరోయిన్లను టార్గెట్ చేసింది. కావాలని చేసిందా? అలా జరిగపోతోందా అన్నది అప్రస్థుతం.. జరగాల్సిన డ్యామేజ్ మాత్రం జరిగిపోతోంది.
శ్రీలీలా మొదటి బాధితురాలు పూజా హెగ్డే. ఏదో మూడు నాలుగు వరుస ఫ్లాపులు పడొచ్చు కాని, తన గ్లామర్, అందుకు తగ్గ ఆఫర్లకు కొదువేలేదు. కాని ఏమైంది కంటి ముందు శ్రీలీల మంచి ఆప్షన్ గా కనిపించే సరికి గుంటూరు కారం నుంచి తనని గెంటేసి, శ్రీలీలను మేయిన్ లీడ్ గా మార్చాడు మహేశ్ బాబు. ఇక ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో హీరోయిన్ రోల్ పూజాది. ముందు తను వద్దంది, తర్వాత కావాలంది. కాని శ్రీలీలకే పిలుపెల్లింది.
శ్రీలీల వల్ల బాధితురాలైన రెండో హీరోయిన్ రష్మిక. తను నిజానికి నేషనల్ క్రష్. పుష్ప పుణ్యమాని పాన్ ఇండియా హీరోయిన్ అయ్యింది. విజయ్, నితిన్ లాంటి యంగ్ హీరోలకి, మహేశ్, ఎన్టీఆర్ లాంటి టాప్ హీరోలకి తను మంచి జోడీ అనుకున్నారు. కాని శ్రీలీల వచ్చి రష్మిక ఆఫర్లకు గండి కొట్టేసింది. ఇంకా ఘోరంగా చెప్పలాంటే ఉప్పెన ఫేం క్రుతి శెట్టికి ఆల్టర్ నేటివ్ కూడా శ్రీలీలనే అయ్యింది.
పవన్, ప్రభాస్, మహేశ్ మూవీల్లో శ్రీలీలనే హీరోయిన్.. నితిన్, వరుణ్ అండ్ కో సినిమాల్లో శ్రీలీలనే హీరోయిన్. ఈ లేడీ వచ్చాక అసలూ పూజా, రష్మిక, క్రుతి శెట్టికి ప్రాధాన్యతే లేదు. తక్కువ రెమ్యునరేషన్ కి ఎక్కువ గ్లామర్ కమ్ ఫ్రెష్ ఫేసు అన్న కోణంలో, ఆ ముగ్గురికి ఈ ఒక్క హీరోయిన్ ఎసరు పెట్టేసింది. అది కూడా ఏరేంజ్ లో అంటే పూజా,రష్మిక, క్రుతి శెట్టి కెరీరే క్లోజ్ అవుతుందా అన్న అనుమానాలు వచ్చేంతగా నలిపేస్తోంది.