Pooja Hegde: ఆఫర్లు నిల్.. అయినా తగ్గని పూజా హెగ్డే..
డేట్లు అడ్జెస్ట్ కావట్లేదని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి పక్కకొచ్చింది. గుంటూరు కారం టీం తన పద్దతి నచ్చకే సైడ్ చేసేసింది.

Pooja Hegde: పూజాహెగ్డే తప్పు మీద తప్పుచేస్తోంది. చేతులు కాలుతున్నా, తన ఆలోచన మారట్లేదు. కొత్తగా మాస్ మహరాజా రవితేజ సినిమా నుంచి కూడా తనని గెంటేశారట. అంతటికీ తను తగ్గక పోవటమే కారణమని తెలుస్తోంది. నిర్మాతలకు తనంటే విసుగొచ్చినట్టే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ కెరీర్‌లో 5 ఫ్లాపులు ఫేస్ చేసింది.
SALAAR: మూడు రోజుల్లో 400 కోట్లు.. వెయ్యి కోట్లు సాధ్యమేనా..?
ఈ ఏడాది కిసీకా భాయ్ కిసీకా జాన్ అంటూ మరో డిజాస్టర్‌తో సైలెంట్ అయ్యింది. డేట్లు అడ్జెస్ట్ కావట్లేదని ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ నుంచి పక్కకొచ్చింది. గుంటూరు కారం టీం తన పద్దతి నచ్చకే సైడ్ చేసేసింది. ఇలా పవన్, మహేశ్ మూవీ ఆఫర్లు కోల్పోయిన పూజా, తర్వాత ఏదో హిందీ మూవీ ఆఫర్ పట్టిందనుకుంటుంటే.. అక్కడ కూడా సీన్ రివర్స్ అయినట్టే ఉంది. రూ.6 కోట్లు డిమాండ్ చేయటంతో షాహిద్ కపూర్ మూవీ దేవాలో ఆఫర్ కాస్త ఆవిరైందట. అంతేకాదు హరీష్ శంకర్‌తో రవితేజ చేస్తున్న సినిమాకు కూడా పూజానే తీసుకోవాలనుకున్నారు.
కానీ, తను రూ.4 కోట్లకు ఒక్క పైసా తగ్గనందట. దీంతో చిర్రెత్తుకొచ్చి హిందీ ముద్దుగుమ్మకి ఆఫర్ ఇచ్చారు. అలా భాగ్యశ్రీ బస్రా అనే కొత్త హీరోయిన్‌కి ఆఫర్ దక్కింది. ఇలా అన్ని అవకాశాలు కోల్పోతున్న తను, మొత్తానికి ఓటీటీ ఆఫర్ పట్టింది. డీ మాంటీ కాలనీ దర్శకుడు తీసే సినిమాలో రెండో హీరోయిన్‌గా కనించబోతోంది. అలా సిల్వర్ స్క్రీన్ మీద పంచ్ పడితే, స్మాల్ స్క్రీన్‌కి అతుక్కుపోవాల్సి వస్తోంది.