జర్నలిస్ట్ పై రెచ్చిపోయిన పూజా, కూల్ చేసిన బాలీవుడ్ స్టార్ హీరో

తెలుగులో చాన్సులు తగ్గటంతో బాలీవుడ్ లో ట్రై చేస్తోంది పూజా హెగ్డే. ఒకప్పుడు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోలు సినిమాల్లో కంటిన్యూగా ఆఫర్లు కొట్టేస్తా అక్కడే బిజీబిజీగా ఉంటుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 3, 2025 | 02:41 PMLast Updated on: Feb 03, 2025 | 2:41 PM

Pooja Hegde Serious On Journlists

తెలుగులో చాన్సులు తగ్గటంతో బాలీవుడ్ లో ట్రై చేస్తోంది పూజా హెగ్డే. ఒకప్పుడు తెలుగులో వరుస ఆఫర్లతో బిజీగా గడిపిన ఈ అమ్మడు ఇప్పుడు మాత్రం బాలీవుడ్ లో స్టార్ హీరోలు సినిమాల్లో కంటిన్యూగా ఆఫర్లు కొట్టేస్తా అక్కడే బిజీబిజీగా ఉంటుంది. లేటెస్ట్ గా ఆమె సాహిద్ కపూర్ హీరోగా వస్తున్న దేవ సినిమాలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది. దీనితో సినిమా ప్రమోషన్స్ లో పూజ హెగ్డే స్పీడ్ పెంచింది. షాహిద్ కపూర్ తో కలిసి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యింది పూజ. ఈ సందర్భంగా జర్నలిస్టులు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆమె ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ ఇచ్చింది

బాలీవుడ్ స్టార్ హీరోలైన సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ వంటి హీరోల సినిమాల్లో నటించడం లక్కు గా ఫీల్ అవుతున్నారా అంటూ ఆమెను ఓ జర్నలిస్ట్ క్వశ్చన్ అడిగాడు. అలాగే ఈ సినిమాలకు మీరు అర్హులు అని అనుకుంటున్నారా అంటూ కొన్ని ప్రశ్నలు వేశాడు. దీనికి పూజా వైలెంట్ గా రియాక్ట్ తాను నటించిన ప్రతి సినిమాకు తాను అర్హురాలునే అంటూ ఆన్సర్ ఇచ్చింది. వాళ్ల సినిమాల్లోకి డైరెక్టర్లు అలాగే నిర్మాతలు తనను తీసుకోవడంలో వాళ్ల రిక్వైర్మెంట్స్ వాళ్లకు ఉంటాయని ఏదైనా అవకాశం వచ్చినప్పుడు దానికి అనుగుణంగా రెడీ అయి పూర్తిస్థాయిలో ఆ క్యారెక్టర్ కు న్యాయం చేయాలని పూజా కామెంట్ చేసింది.

అలా చేస్తే అదృష్టం వరించినట్లే అని తన జీవితంలో అదే జరిగిందని క్లారిటీ ఇచ్చింది. ఒకవేళ మీరు అదృష్టం వల్లే నాకు ఈ ఛాన్సులు వచ్చాయనుకుంటే నేను ఏమాత్రం బాధపడనంటూ అలాగే అనుకోవాలని జర్నలిస్టుకు సీరియస్ గా రిప్లై ఇచ్చింది. ఇక మీరు సినిమాలు ఎలా సెలెక్ట్ చేసుకుంటారు స్టార్ హీరోల సినిమాలు అయితేనే చేస్తారా అనే మరో ప్రశ్నకు గాను.. అసలు మీ సమస్య ఏంటి అంటూ జర్నలిస్టులపై సీరియస్ అయ్యారు. దీనితో వాతావరణం కాస్త హీటెక్కుతుందని భావించిన షాహిద్ కపూర్ సరదాగా ఆన్సర్లు ఇచ్చాడు. నువ్వు యాక్ట్ చేసిన స్టార్ హీరోలంటే అతనికి ఇష్టం అనుకుంటా అతడు కూడా ఆ హీరోల పక్కన ఆక్ట్ చేయాలనుకుంటున్నారు అందుకే నీ నుంచి సలహాలు తీసుకుంటున్నట్లు ఉన్నారంటూ జోకులేసాడు.