Pooja Hegde: మళ్లీ మెగా కుర్రోళ్లే దిక్కయ్యారు.. తంతే ఎక్కడ పడింది..?
పూజా హెగ్డే కిమళ్లీ మెగా కుర్రాళ్లో దిక్కయ్యారు. ఛాన్స్ ఇస్తున్నారు. విచిత్రం ఏంటంటే మెగా కాంపౌండ్ లో అడుగు పెడితే ఏ హీరోయిన్ ఫేటైనా మారిపోతుందని తెలిసీ, పవన్ సినిమాను వదులుకుంది పూజా. అలా ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి బయటికొచ్చింది. డేట్లు కుదర్లేదు, పాత డేట్లు సినిమా టీ వాడలేదు లాంటి కారణాలెలా ఉన్నా, ఇప్పుడు ఈ హీరోయిన్ కి ఆఫర్లు లేవు.

Pooja Hegde started her career with mega hero and received a series of applause in the middle
మహేశ్ మూవీ పోయింది. కోలీవుడ్ తనని పొమ్మంది. బాలీవుడ్ లో రెండు ఆఫర్స్ ఉన్నా 6 నెలల వరకు అవి పట్టాలెక్కే ఛాన్స్ లేదు. సో ప్రజెంట్ ఈ ముద్దుగుమ్మ ఖాళీ.. అందుకే పోగొట్టుకున్న చోటే వెతుకుతోందట. మెగా హీరోతో జోడీకి ప్రయత్నించిందట. అలా సాయితేజ్ కొత్త మూవీలో పూజా హెగ్డేకి ఆఫర్ అందిందని తెలుస్తోంది.
సంపత్ నంది మేకింగ్ లో సాయితేజ్ చేసే సినిమాలో పూజా హెగ్డే కన్ఫామ్ అయ్యింది. ఐతే తెలుగులో ముకుందా అంటూ వరుణ్ తేజ్ తోనే జోడీ కట్టి ఎంట్రీ ఇచ్చిన పూజాకి, అప్పుడు మెగా కుర్ర హీరోనే కలిసొచ్చాడు. ఇప్పుడు మరో మెగా హీరో ఆఫర్ ఇచ్చాడు. మొత్తానికి పూజా అటు తిరిగి ఇటు తిరిగి చివరికి మెగా కాంపౌండ్ లోనే అడుగు పెట్టింది.