Umair Sandhu: క్రిటిక్‌ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపిన హీరోయిన్

ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా.. నోటికొచ్చినట్లు తమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్. టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: July 28, 2023 | 07:23 PMLast Updated on: Jul 28, 2023 | 7:23 PM

Pooja Hegde Sues Critic Umair Sandhu For Spreading False Suicide Claims 2

Umair Sandhu: స్టార్‌ యాక్టర్ల మీద తప్పుడు ప్రచారాలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు ఉమైర్ సంధూ. ఫిల్మ్ క్రిటిక్ అంటూ చెప్పుకునే ఉమైర్.. బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో సెలబ్రిటీల వ్యక్తిగత విషయాల గురించి షాకింగ్ ట్వీట్స్ చేస్తుంటాడు. గతంలో హీరోయిన్ కృతి సనన్, ప్రభాస్, పూజా హెగ్డేపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా సోషల్ మీడియా వేదికగా.. నోటికొచ్చినట్లు తమ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు అతనికి బుద్ధి చెప్పేందుకు రెడీ అవుతున్నారు స్టార్స్.

టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే.. అతనికి లీగల్ నోటీసులు పంపించినట్లుగా తెలుస్తోంది. ఈ విషయాన్ని ఉమైర్ సంధు తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. ఇటీవల తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు అతడికి పూజా నోటీసులు పంపించింది. పూజా హెగ్డే సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్స్ అయ్యాయని.. ఆమె ఇప్పుడు ఐరన్ లెగ్ అంటూ ఉమైర్ సంధు ఈ మధ్య ట్వీట్ చేశాడు. ఆమె డిప్రెషన్‏తో బాధపడుతూ మధ్యాహ్నం సమయంలో ఆత్మహత్యకు ప్రయత్నించారని.. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే రక్షించారని.. దేవుడికి ధన్యవాదాలు అంటూ ఓ ట్వీట్‌ వదిలాడు. అతను చేసిన ట్వీట్.. క్షణాల్లో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అతని వ్యాఖ్యలతో విసిగిపోయిన పూజా హెగ్డే.. తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాడని.. దీంతో తన కెరీర్‏కు నష్టం కలుగుతుందని.. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉమైర్ సంధుకు లీగల్ నోటీసులు పంపించింది.

అయితే లీగల్ నోటీసులు వచ్చినా.. వాటిని కూడా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ కామెడీ చేస్తున్నాడు ఉమైర్ సంధు. పూజా హెగ్డే తనకు లీగల్ నోటీసులు పంపించిందని.. గతంలో ప్రభాస్‏తో తన పేరును ఉపయోగించినందుకు కృతి సనన్ కూడా నోటీసులు పంపిందంటూ మరో ట్వీట్ చేశాడు. కేవలం వీరిద్దరి గురించి మాత్రమే కాదు.. బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకొణే, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి తారల గురించి కూడా వివాదాస్పద ట్వీట్స్ చేశాడు ఉమైర్.