Pooja Hegde: కోటి కోసం ఈగోని చంపుకున్న పూజా హెగ్డే..
కూటి కోసం కోటి విద్యలంటారు. కాని కోటి కోసం ఇంకేదో విద్యని ప్రదర్శిస్తోంది హీరోయిన్ పూజా హెగ్డే.

Pooja Hegde, who put aside her ego and heroine status for opportunities, said OK for an item song in the movie Guntur Karam
ఎన్ని డేట్లిచ్చినా షూటింగ్ జరగలేదని ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విషయంలో హీరో కోసం తన డేట్లు రీషెడ్యూల్ చేయాలా అంటూ పూజా హెగ్డే ఈగోకి వెళ్లిందట. గుంటూరు కారం విషయంలో అదే జరిగిందట. అలా పూజా హెగ్డే తన ఈగో వల్లే రెండు ప్రాజెక్ట్స్ నుంచి బయటికి పంపేయబడిందంటున్నారు. కట్ చేస్తే ఇప్పుడు అదే ఈగోని కోటి కోసం పక్కన పెట్టిందట పూజా హెగ్డే. గుంటూరు కారం కోసం కోటి వరకు అడ్వాన్స్ తీసుకుంది పూజా. కాని తనని సినిమా నుంచి బయటికి పంపేయటంతో, ఇప్పడు ఆ అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయమనే పరిస్థితి.
నిర్మాత కూడా తనతో మాట్లాడేందుకు ఇష్టంగా లేకపోవటంతో, వ్యవహారం అంతా మేనేజర్ స్థాయి వ్యక్తులే నడుపారట. ఏంటంటే ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇయ్యకున్న పర్లేదు, గుంటూరు కారంలో ఓ ఐటమ్ సాంగ్ చేయాలి. ఇది కండీషన్.. పూజా కూడా ఎలాగూ కోటి తిరిగి ఇవ్వాల్సిన పనిలేదు కాబట్టి సరే అందట. కాని సినిమా టీంతో ఈగో క్లాషెస్ వల్ల ప్రాజెక్ట్ వదులుకోవాల్సి వచ్చింది. మరి సెట్లో మళ్లీ ఎలా అడుగు పెడుతుందంటే, కోటి కోసం తప్పదు మరి అంటున్నారు. సో గుంటూరు కారంలో మేయిన్ లీడ్ నుంచి బయటికి పంపేశాక, అదే మూవీలో ఐటమ్ సాంగ్ చేయాలని ఎవరూ అనుకోరు. కాని కోటి తిరిగి ఇవ్వాల్సి వస్తుందని, పూజా ఇలాంటి నిర్ణయం తీసుకుందని కామెంట్లు పేలుతున్నాయి