Devara : దేవరలో పూజా హెగ్డే ఐటమ్ సాంగ్..
గ్లోబల్ స్టార్ (Global Star) ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర.

Pooja Hegde's item song in Devara..
గ్లోబల్ స్టార్ (Global Star) ఎన్టీఆర్ (NTR) హీరోగా.. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం దేవర. పాన్ ఇండియా మూవీగా రూపోందుతున్న దేవర రెండు భాగాలుగా తెరకెక్కతుంది. ఇందులో బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్ (Janhvi Kapoor) నటిస్తుంది. ఇక విలన్‌గా సైఫ్‌అలీఖాన్ (Saif Ali Khan) నటిస్తున్న సంగతి తెలిసిందే. సముద్రం బ్యాక్ డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదల చేస్తునన్నారు.
తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ వైరల్ అవుతుంది.దేవరలో ఓ ఐటెం సాంగ్ ఉందని తెలుస్తోంది. అందుకోసం స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. ఆమె గతంలో రంగస్థలంలో జిగెలు రాణి పాటకు ఆడిపాడింది. అంతే కాదు పాప ఇప్పుడు పెద్ద బిజీగా కూడా ఏం లేదు.
వరుస ఫ్లాపుల కారణంగా పూజాను మేకర్స్ పెద్దగా పట్టించుకోవడం లేదు. అందుకే దేవరలో ఐటెం సాంగ్ చేయడానికి ఓకె చెప్పినట్టు సమాచారం. అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. అయితే పూజా హెగ్డే నుంచి కానీ మూవీ టీమ్ నుంచి కానీ ఎలాంటి ప్రకటన అయితే లేదు. మరీ ఐటమ్ సాంగ్ ఉంటుందో లేదో మరి కొన్ని రోజుల్లో తేలనుంది.