Poonam Pandey : రూ.100 కోట్లు పూనమ్ కట్టాల్సిందే..!
శృంగారతారగా పూనమ్ పాండే (Poonam Pandey) ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీ అందంతో కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది. అసలు పూనమ్ కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అంతలా తన అందంతో అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఉన్నట్టుండి.. గత కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు.

Poonam has to pay Rs. 100 crores..!
శృంగారతారగా పూనమ్ పాండే (Poonam Pandey) ఎంత గుర్తింపు తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బ్యూటీ అందంతో కుర్రాళ్లకు కునుకు రాకుండా చేసింది. అసలు పూనమ్ కనిపిస్తే చాలు అనుకునే వారు చాలామందే ఉన్నారు. అంతలా తన అందంతో అట్రాక్ట్ చేసింది ఈ బోల్డ్ బ్యూటీ. కానీ ఉన్నట్టుండి.. గత కొన్నాళ్లుగా గర్భాశయ క్యాన్సర్ (Cervical Cancer) తో బాధపడుతున్న పూనమ్ మరణించిందనే వార్త విని ఆమె అభిమానులు షాక్ అయ్యారు. విషయాన్నీ ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా తెలపడంతో.. పూనమ్ ఇక లేదనుకున్నారు. దేవుడా 32 ఏళ్ళకే మా నుంచి దూరం చేశావా అంటూ.. ఆమె అభిమానులు లబోదిబోమన్నారు. కానీ ఇదంతా తూచ్.. తాను బతికే ఉన్నాను అంటూ స్టంట్ చేసింది పూనమ్.
క్యాన్సర్ అవగాహన కోసం ఇలా చేశానని చెప్పి మరో షాక్ ఇచ్చింది. దీంతో బ్యూటీ ఫ్యాన్స్‌తో పాటు నెటిజన్స్ కూడా పూనమ్ ఓ రేంజ్‌లో మండిపడ్డారు. ముద్దుగుమ్మ చేసిన పనికి నెట్టింట విమర్శలు వెల్తువెత్తాయి. దారుణంగా తిట్టిపోశారు నెటిజన్లు. అంతేకాదు.. పూనమ్ ఇలా చేయడం కరెక్ట్ కాదని.. రియాల్టీ షో డేటింగ్ బాజీ ఫేమ్ ఫైజాన్ అన్సారీ పరువునష్టం దావా వేశారు. పూనమ్ పాండే, ఆమె భర్త సామ్ బాంబేపై 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. దీంతో సీపీ అఖిల్ కుమార్ (CP Akhil Kumar) ఈ కేసుపై పూనమ్ దంపతులను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సీపీ విచారణను ఫైల్ఖానా ఇన్‌స్పెక్టర్‌కు అప్పగించగా.. ఫైజాన్ అన్సారీ కాన్పూర్ కోర్టులో దావా వేయనున్నట్లు తెలిపారు.
పూనమ్ పాండే దేశ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని ఫైజాన్ ఆరోపించారు. ఆమె బతికే ఉండొచ్చు గానీ.. చనిపోయానని చెప్పి ప్రజలను భయబ్రాంతులకు గురి చేసిందని తెలిపారు. దీంతో పూనమ్‌కు కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది.