Poonam Kaur: భగత్ సింగ్‌ను అవమానిస్తారా.. మరోసారి పవన్‌ను టార్గెట్ చేసిన పూనమ్
పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర భగత్ సింగ్ పేరు ఉంది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది పూనమ్. ఇది కచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్ దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది.

Poonam Kaur: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను హీరోయిన్ పూనమ్ కౌర్ మరోసారి టార్గెట్ చేసింది. ఇన్ డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్ సినిమాను టార్గెట్ చేస్తూ షాకింగ్ ట్వీట్ చేసింది. పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి తాజాగా పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ పోస్టర్లో పవన్ కళ్యాణ్ కాళ్ళ దగ్గర భగత్ సింగ్ పేరు ఉంది. ఈ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది పూనమ్.
ఇది కచ్చితంగా భగత్ సింగ్‌ను కించపరచడమేనని, భగత్ సింగ్ యూనియన్ దీన్ని రిపోర్ట్ చేయండని ట్వీట్ చేసింది. దీంతో పవన్ ఫ్యాన్స్ నీకేం పనీపాటా లేదా? మధ్యలో ఎందుకు దూరుతున్నావని ఫైర్ అయ్యారు. రీసెంట్‌గా పూనం కౌర్ మరో ట్వీట్ చేసింది. ‘స్వాతంత్య్ర సమరయోధులను గౌరవించకపోయినప్పటికీ కనీస మర్యాద ఇవ్వాలి. అంతేకానీ ఇలా కించపర్చకూడదు. సినిమా పోస్టర్‌లో ఆయన పేరును నీ కాలి కింద పెట్టుకుంటావా? ఇది అహంకారమా? లేక అజ్ఞానమా?’ అని ట్వీట్ చేసింది. ఇది చుసిన ఫ్యాన్స్ మల్లి పూనమ్ కౌర్‌ను టార్గెట్ చేస్తున్నారు. నిజానికి పూనమ్ కౌర్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా చాల సార్లు పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తూ ట్వీట్లు చేసింది పూనమ్.
సినిమా పరంగానే కాదు.. పాలిటిక్స్ పరంగా కూడా పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసింది. కొందరు బట్టలు మార్చినంత ఈజీగా మనసుల్ని, మనుషుల్ని మార్చేస్తారంటూ అప్పట్లో పూనమ్ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. అప్పుడు కూడా పవన్ ఫ్యాన్స్ పూనమ్ కౌర్‌ను ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. కొంత కాలం సైలెంట్ గానే ఉన్నా.. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. వార్తల్లో నిలిచేందుకు పూనమ్ కౌర్ ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.