Poonam Pandey: పూనమ్‌ పాండే మరణం.. వ్యాక్సిన్‌పై మళ్లీ చర్చ..

గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదకరమైంది. అది ఎలా వస్తుందో తెలియదు. చివరికి గుర్తించేలోపే చనిపోవడం జరుగుతుంది. ట్రీట్‌మెంట్‌ విధానం కూడా.. క్రిటికలే! ముందుగా ఈ లక్షణాలను గుర్తిస్తే.. ఏదైనా చేయగలరు. ఈ క్యాన్సర్‌ ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ కారణంగా వస్తుంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2024 | 02:33 PMLast Updated on: Feb 02, 2024 | 2:33 PM

Poonam Pandey Dies Of Cervical Cancer Vaccination A Priority

Poonam Pandey: బాలీవుడ్‌ నటి పూనమ్‌ పాండే గర్భాశయ కేన్సర్‌తో చనిపోయారు. ఈ వ్యాధి కోసం చికిత్స తీసుకుంటూ ఆమె ప్రాణాలు విడిచారు. దీంతో ఇప్పుడు గర్భాశయ కేన్సర్‌ గురించి చర్చ మొదలైంది. గర్భాశయ క్యాన్సర్‌ ప్రమాదకరమైంది. అది ఎలా వస్తుందో తెలియదు. చివరికి గుర్తించేలోపే చనిపోవడం జరుగుతుంది. ట్రీట్‌మెంట్‌ విధానం కూడా.. క్రిటికలే! ముందుగా ఈ లక్షణాలను గుర్తిస్తే.. ఏదైనా చేయగలరు. కానీ.. స్టేజ్‌ దాటితే గర్భాశయ క్యాన్సర్‌కి చికిత్స తీసుకున్నా బతికే ఛాన్స్‌లు చాలా తక్కువ.

Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్‌ చివరి పోస్ట్‌..

దీంతో ఏటా కొన్ని వేలమంది మహిళలు.. ఈ క్యాన్సర్‌ బారినపడి చనిపోతున్నారు. ఈ క్యాన్సర్‌ ప్రధానంగా హ్యూమన్‌ పాపిల్లోమా వైరస్‌ కారణంగా వస్తుంది. చిన్న వయస్సులో పెళ్లి చేయడం, లైంగిక సంబంధాలు కొనసాగించడం, ముందస్తు ప్రసవాలు, ఎక్కువ మంది పిల్లలను కనడం, ధూమపానం, మద్యపానం అలవాట్లు ఈ క్యాన్సర్‌ రావడానికి కారణాలుగా డాక్టర్లు చెప్తున్నారు. రెండుమూడు రోజుల ముందు వరకు ఆరోగ్యంగా సోషల్‌ మీడియాలో కనిపించిన పూనమ్‌ పాండే.. ఇక లేదని, ఆమె మరణానికి గర్భాశయ కేన్సరే కారణం అని తెలియడంతో.. ఆమె అభిమానులతో పాటు సామాన్యులు కూడా అవాక్కవుతున్నారు. దీంతో ఇప్పుడు గర్భాశయ కేన్సర్ రాకుండా తీసుకునే వ్యాక్సిన్ మీద జనాల్లో చర్చ మొదలైంది. మాములుగా 30ఏళ్లు పైబడిన మహిళల్లో ఈ రకం కేన్సర్ వస్తుంది.

ఆడపిల్లలు చిన్న వయసులోనే టీకాలు తీసుకోవడం ద్వారా.. ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉండచ్చని నిపుణులు సూచిస్తున్నారు. 9 సంవత్సరాల నుంచి 15 ఏళ్లలోపు ఆడపిల్లలకు రెండు డోసుల టీకాలను వేయించాలి. 15సంవత్సరాలు వయసు దాటిన ఆడపిల్లలు మూడు డోసులు తీసుకోవాలి. సర్వైకల్‌ క్యాన్సర్ వ్యాక్సిన్‌ను 45 ఏళ్ల వయసులోనూ తీసుకోవచ్చు. అయితే పెళ్లికి ముందు ఈ వ్యాక్సిన్‌ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.