పూనం డేరింగ్ ట్వీట్, త్రివిక్రమ్ పై సంచలన కామెంట్స్
సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా పరిశ్రమలో బాధితులు అందరూ బయటకు రావాలి అంటూ పలువురు కోరుతున్నారు.
సినిమా పరిశ్రమలో లైంగిక వేధింపుల కేసు తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేయడం ఖాయం అనే వార్తలు వస్తున్నాయి. ఇక సినిమా పరిశ్రమలో బాధితులు అందరూ బయటకు రావాలి అంటూ పలువురు కోరుతున్నారు. స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు చాలా మందే వేధిస్తున్నారని బాధితులు భయంతో రాలేకపోతున్నారు అంటూ సోషల్ మీడియాలో సైతం కామెంట్స్ వస్తున్నాయి. ప్రస్తుతం జానీ మాస్టర్ వ్యవహారాన్ని సినిమా పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు.
జానీ మాస్టర్ ను పూర్తిగా అన్ని ప్రాజెక్ట్ ల నుంచి తప్పించే అవకాశం కనపడుతోంది. ఈ వ్యవహారంపై నటి పూనం కౌర్ కూడా స్పందించిన సంగతి తెలిసిందే. అతన్ని షేక్ జానీ అని పిలావాలని మాస్టర్ అనే పదానికి అతను అర్హుడు కాదని కోరింది. ఇక మరో పోస్ట్ చేసిన పూనం ఈ సారి సంచలన కామెంట్స్ చేసింది. తాను త్రివిక్రమ్ శ్రీనివాస్‌పై ఇచ్చిన కంప్లయిట్‌ను తీసుకున్నారా అంటూ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ను ప్రశ్నిస్తూ ఎక్స్ లో పోస్ట్ చేసింది. నాలాంటి వాళ్లకి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ లేకపోవచ్చు. అందుకే నన్ను సైలెంట్ గా పక్కనబేట్టేశారని అన్నారు పూనం.
నేను అప్పుడు మా అసోసియేషన్‌లో ఉన్న పెద్దవాళ్లకి కంప్లయింట్ చేశానని… ఇప్పుడైన ఇండస్ట్రీ పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్‌ను ప్రశ్నించాలని కోరుతున్నాను అంటూ పోస్ట్ చేసింది. గతంలో కూడా ఆమె త్రివిక్రమ్ లక్ష్యంగా ఆరోపణలు చేసింది. త్రివిక్రమ్ ఎలాంటి వాడో, ఆయన చెడు స్వభావం ఎంటో నాకు తెలుసు అంటూ కామెంట్ చేసింది. మగవారి ఇగో కోసం ఆయన సపోర్ట్ చేస్తారని కూడా తెలుసని… నీవు నీ అనుభవంతో మాట్లాడుతుంటే.. నేను నా అనుభవంతో మాట్లాడుతున్నానని… ఇతరుల జీవితాలను త్రివిక్రమ్ నాశనం చేస్తారంటూ ఆమె వ్యాఖ్యలు చేసారు. ఒకసారి త్రివిక్రమ్ దగ్గరకు వెళ్లి తనకు ఆయన ఏం చేశాడో, వేరే వాళ్ల చేత ఏం చేయించాడో ఆయన్నే అడగండని సంచలన వ్యాఖ్యలు చేసింది.