Samantha: సమంతకు ముదిరిన మయోసైటిస్.. సినిమాలకు బ్రేక్..
స్టార్ హీరోయిన్ సమంత మయోసైటిస్‌తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఓ పక్క ట్రీట్‌మెంట్ తీసుకుంటూనే మరోపక్క తన ప్రాజెక్ట్‌లు కంప్లీట్ చేసింది సమంత. చాలా సందర్భాల్లో ప్రాజెక్టులు చేస్తూనే ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అయితే ప్రస్తుతం సమంతకు మయోసైటిస్ ముదిరినట్టుగా తెలుస్తోంది.

Popular actress Samantha is suffering from myositis disease and now she has gone abroad for treatment as it is getting worse
ప్రెజెంట్ విజయ్ దేవరకొండతో ఖుషీ, బాలీవుడ్‌లో సిటాడెల్ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది సమంత. ఆ రెండు ప్రాజెక్ట్‌లు దాదాపు పూర్తయ్యాయి. కానీ తరువాత చేసే ప్రాజెక్ట్ గురించి మాత్రం సమంత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. నిజానికి కొత్త ప్రాజెక్ట్స్ ఏవీ సమంత ఒప్పుకోలేదట. గతంలో సైన్ చేసిన కొన్ని ప్రాజెక్ట్‌లు కూడా క్యాన్సిల్ చేసుకుని ప్రొడ్యూసర్లకు చెక్‌లు తిరిగి ఇచ్చేసిందట. దీనికి కారణం సమంత అనారోగ్యమే అంటున్నారు. ఇంతకాలం నార్మల్‌గా ఉన్న మయోసైటిస్ ఇప్పుడు సమంతకు మరింత ఇబ్బందిగా మారిందట. దీంతో దీర్ఘకాలికంగా ట్రీట్‌మెంట్ తీసుకోవాలని సమంత నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
దానికోసం ఆమె విదేశాలకు వెళ్లేందుకు కూడా రెడీ అయినట్టు తెలుస్తోంది. ట్రీట్‌మెంట్‌కు ఇబ్బంది కాకూడదే కొత్త ప్రాజెక్ట్‌లు ఏవీ సమంత చేయడంలేదట. చికిత్స పూర్తైన తరువాత మళ్లీ కెరీర్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో సమంత ఫ్యాన్స్ ఆమె ఆరోగ్యం గురించి తెగ వర్రీ ఐపోతున్నారు. సామ్ త్వరగా కోలుకోవాలంటూ పోస్ట్‌లు పెడుతున్నారు.