పవన్ కళ్యాణ్ గురువు కన్నుమూత.. తీవ్ర విషాదంలో పవర్ స్టార్..!
జీవితంలో మనం ఎంత పైకి ఎదిగినా ఆ ఎదుగుదలకు తోడ్పాటు చేసింది మాత్రం మన గురువులే. అందుకే జీవితంలో వాళ్ళని మర్చిపోకూడదు అంటారు.

జీవితంలో మనం ఎంత పైకి ఎదిగినా ఆ ఎదుగుదలకు తోడ్పాటు చేసింది మాత్రం మన గురువులే. అందుకే జీవితంలో వాళ్ళని మర్చిపోకూడదు అంటారు. అలాంటి గురువులు దూరమైనప్పుడు తెలియని ఒక బాధ గుండెలను మెలిపెడుతుంది. తాజాగా పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా ఇదే. ఆయనకు ఎంతో ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ గురువు, ప్రముఖ కోలీవుడ్ నటుడు షిహాన్ హుస్సేనీ కన్నుమూశారు. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. షిహాన్ మరణ వార్త విని పవన్ కళ్యాణ్ విషాదంలో మునిగిపోయారు. తనతో ఆయన కూడా జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. కొద్ది రోజులుగా లుకేమియాతో బాధపడుతూ చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చేరారు షిహాన్. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించారు. హుస్సేనీ మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడిని కోరుకున్నారు.
పవన్ కల్యాణ్‌కు మార్షల్ ఆర్ట్స్, కరాటే, కిక్ బాక్సింగ్ నేర్పించారు హుస్సేనీ. ఆయన దగ్గర శిక్షణ తీసుకుంటూనే పవన్ బ్లాక్ బెల్ట్ సాధించారు. తన మొదటి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి లోనే ఆ విద్యలన్నీ చూపించాడు పవన్. అవన్నీ హుస్సేని దగ్గర నేర్చుకున్నవే. ఆయనకి భార్య, కుమార్తె ఉన్నారు. హుస్సేనీ మరణంపై కుటుంబ సభ్యులు అధికారిక ప్రకటన చేశారు. షిహాన్ మమ్మల్ని విడిచిపెట్టారని తెలియజేయడానికి నాకు చాలా బాధగా ఉంది.. హుస్సేనీ సాయంత్రం వరకు బెసెంట్ నగర్‌లోని తన నివాసంలో హైకమాండ్‌లో ఉంటారని అతని కుటుంబం ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. అతని కడసారి చూపు కోసం చాలామంది ప్రముఖులతో పాటు ఆయన శిష్యులు కూడా రాబోతున్నారు. చనిపోవడానికి కొన్ని రోజుల ముందు, హుస్సేని తన శరీరాన్ని వైద్య పరిశోధన కోసం దానం చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించాడు.
కేవలం మార్షల్ ఆర్ట్స్ లోనే కాదు నటనలోనూ ఈయనకు ప్రవేశం ఉంది. 1986లో కమల్ హాసన్ నటించిన పున్నగై మన్నన్ సినిమాతో నటుడిగా అరంగేట్రం చేశారు షిహాన్. ఆ తర్వాత రజనీకాంత్ నటించిన వేలైకరన్, బ్లడ్ స్టోన్ వంటి తమిళ చిత్రాలలో నటించారు. విజయ్ నటించిన బద్రి సినిమాలో ఆయన కరాటే కోచ్ పాత్ర పోషించారు. తెలుగులో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఇది. రెండేళ్ల కింద విజయ్ సేతుపతి, నయనతార, సమంత నటించిన కాతువాకుల రెండు కాదల్ , చెన్నై సిటీ గ్యాంగ్ స్టర్స్ లాంటి సినిమాలలో కూడా షిహాన్ నటించారు. సినిమాలతో పాటు చాలా వరకు తమిళ రియాలిటీ షోలలో న్యాయ నిర్ణేతగా, వ్యాఖ్యాతగా కూడా కనిపించారు. కుస్తీ, శిల్పకళ, యుద్ధ కళలు, విలువిద్యలో కూడా షిహాన్ హుసేనికి ప్రవేశం ఉంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు.