Pawan Kalyan: ఓజీ మూవీ స్టోరీ లీక్..
పవన్ కల్యాణ్ తెరమీద పది సెకన్లు కనిపించినా చాలు.. ఎగిరి గంతేసి రచ్చరచ్చ చేసే అభిమానులు ఎందరో ! సినిమా రిజల్ట్ ఏంటి.. కథ ఎలా ఉంది, స్క్రీన్‌ప్లే ఎలా ఉంది.. మ్యూజిక్ ఎలా ఉంది.. పాటలు ఎలా ఉన్నాయ్.

Power Star Pawan Kalyan director Sujith's upcoming movie OG, there are reports that the story of this movie has been leaked.
ఇది కాదు మ్యాటర్. పవన్ కనిపించాడు అది చాలు అనుకుంటారు ఫ్యాన్స్. అందుకే రిజల్ట్‌తో సంబంధం లేకుండా.. పవన్ మూవీ కలెక్షన్లు కనిపిస్తుంటాయ్. హిట్, ఫట్‌తో సంబంధం లేకుండా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న ఏకైక హీరో పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ప్రస్తుతం వరుసగా మూడు నాలుగు సినిమాలు రిలీజ్‌కు రెడీగా ఉన్నాయ్. దీంతో అభిమానుల ఆనందానికి హద్దుల్లేవ్. మిగతా సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఓజీ మూవీ మీద ఫ్యాన్స్ కాస్త భారీగానే అంచనాలు పెట్టుకున్నారు. ఇప్పటికే మూవీకి సంబంధించి వచ్చి ఫొటోలు, వీడియోలు అంచనాలు పెంచేయగా.. డాన్ లుక్‌లో పవన్ ఎలా ఉండబోతున్నాడనే క్యూరియాసిటీ ప్రతీ అభిమానిని వెంటాడుతోంది.
ఐతే ఈ సినిమాకు సంబంధించి స్టోరీలైన్ బయటకు వచ్చింది. సుజిత్ దర్శకత్వంలో ఓజీ సినిమా తెరకెక్కుతుంది. ఇందులో 60 ఏళ్ల కిందటి గ్యాంగ్‌స్టర్‌గా పవన్ యాక్ట్ చేస్తున్నాడని తెలుస్తోంది. మంచి చేయాలంటే చెడు ముసుగు వేసుకోక తప్పదని.. చెడును ఢీకొట్టాలంటే చెడుగానే కనిపించాలన్న థీమ్‌తో పవన్ కేరక్టర్ డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో స్టోరీ అంతా సాగుతుంది. ఇందులో పవన్ మార్షల్ ఆర్ట్స్ కూడా చేయబోతున్నాడని తెలుస్తోంది. యాక్షన్ ఎపిసోడ్స్ సినిమాకు మరింత ప్లస్ కావడం ఖాయం అంటోంది మూవీ టీమ్.
అక్టోబర్‌నాటికి ఎలాగైనా మూవీ కంప్లీట్ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈలీక్స్‌లో నిజం ఎంత అన్నది పక్కనపెడితే.. ఒక్కో విషయం సినిమా మీద అంచనాలను అమాంతం పెంచేస్తోంది.