Power Star: పవన్ కళ్యాణ్ నుంచి గుడ్ న్యూస్.. బ్యాడ్ న్యూస్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఒక గుడ్ న్యూస్, మరో బ్యాడ్ న్యూస్ ఇస్తున్నాడు. అదేంటంటే, పవన్ కళ్యాణ్ దసరా తర్వాత సినిమాలు చేయడట. ఏదున్న దసరాలోపే. అంటే ఆ లోగా ఎంతవరకు షూటింగ్ అయితే అంతవరకే చేసి వదిలేస్తాడా అంటే, అదేంలేదు. దసరాలోగా పవన్ కళ్యాణ్ సినిమాలన్నీ పూర్తవుతాయి. ఆతర్వాత పొలిటికల్ గా బిజీ అయ్యే పవన్ ఈసారి పూర్తిగా సినిమాలకు దూరం అయ్యే ఛాన్స్ ఉందట.

pawan kalyan movies and politics
తమిళ్ హిట్ మూవీ వినోదియం సీతం తెలుగు రీమేక్ కోసం 25 రోజుల డేట్స్ ఇచ్చిన పవన్, ఆల్రెడీ 22 రోజుల షూటింగ్ పూర్తి చేశాడు. తన పాత్ర తాలూకు సీన్ల షూటింగ్ ఈనెల 30 లోగా పూర్తవుతాయి. ఇక వచ్చేనెల 4 నుంచి హరీష్ శంకర్ మేకింగ్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మొదలౌతుంది. అలానే వారం గ్యాప్ లో సుజీత్ మేకింగ్ లో ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ షూటింగ్ కూడా మొదలౌతుందట. ప్రతీ నెల 12 రోజులు హరీష్ మూవీకి, 12 రోజులు సుజీత్ సినిమాకు డేట్స్ కేటాయించాడట పవన్.
మొత్తంగా 7 నెలల్లో ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాలు పూర్తవ్వాలని తేల్చాడు పవన్. అంతేకాదు 20 రోజులు హరి హర వీరమల్లు కు కేటాయించి ఇది కూడా పూర్తి చేయబోతున్నాడు పవన్. సో చేతిలో ఉన్న నాలుగు మూవీలు దసరాలోగా పూర్తి చేసి, ఏపీ ఎలక్షన్స్ మీదే పూర్తిగా ఫోకస్ చేయనున్నాడు పవన్. అంతేకాదు, ఏపీలో పరిస్థితులు నెల నెలకి రకరకాలుగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తు క్లారిటీ వచ్చి, జనసేన డిమాండ్స్ ఓకే అయితే,పవన్ సీఎం అయ్యే ఛాన్స్ కూడా ఉందనే ఊహాగానాలు పెరిగాయి.
అదే జరిగితే కనీసం ఐదారేళ్లవరకు పవన్ ఏ సినిమా చేయకపోవచ్చని. ఆ కాన్ఫిడెన్స్ తోనే పవన్ చేతిలో ఉన్న మూవీలు పూర్తి చేసి, రాజకీయాలకోసం మళ్లీ సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఉందట.. ఇది పవన్అభిమానులకు పొలిటికల్ గా గుడ్ న్యూస్, సినిమాల పరంగా బ్యాడ్ న్యూస్ అనుకోవాల్సి వస్తోంది. ఐనా పవన్ వేంగా 4 సినిమాలు పూర్తి చేస్తే, కనీసం ఏడాదిన్నర వరకు పవన్ సినీ సందడి ఉంటుంది కాబట్టి,అలా అభిమానులు సరిపెట్టుకునే ఛాన్స్ ఉంది.