Pawan Kalyan: ఆదిపురుష్ కి అభయ హస్తం ఇస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్
ఆదిపురుష్ వల్ల డిస్ట్రిబ్యూటర్లు రోడ్డున పడే పరిస్థితి వస్తోంది. ముఖ్యంగా కొన్ని చోట్ల డిస్డ్రిబ్యూటర్ ని ఫాలో అయిన ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారు. ఆ నష్టాలను పూడ్చేందుకు పవర్ ఫుల్ బ్రో రంగంలోకి దిగుతున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పడుు ఆదిపురుష్ బాధితులను కాపాడబోతున్నాడట.

Power Star Pawan Kalyan has offered distributors who lost with Adipurush to release his film without advance
పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆదిపురుష్ తెలుగు రైట్స్ తీసుకుని, బయ్యర్లకు అమ్మేసింది. వాళ్లు ఆదిపురుష్ ఫ్లాప్ తో తీవ్రంగా నష్టపోయారట. దీంతో ఓ డిస్ట్రిబ్యూషన్ సంస్థగా కూడా ఈ నష్టాన్ని మరోలా భర్తీ చేసేందుకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్ణయం తీసుకుంది.
తమ దగ్గర ఆదిపురుష్ ని కొన్న బయ్యర్స్ కి ఇప్పుడు పవర్ స్టార్ మూవీ బ్రో ఆఫర్ ఇస్తోంది. అడ్వాన్స్ లేకుండా పవన్ మూవీ బ్రోని కొనుక్కుని, వసూళ్లు వచ్చాకే పే చేయమంటోందట పీపుల్స్ ఫ్యాక్టరీ సంస్థ. ఈ బ్యానర్ లోనే తెరకెక్కుతున్న మూవీ అవటంతో ఇలా డిస్ట్రిబ్యూషన్ లో జరిగిన మిస్టేక్ కి నిర్మాతగా మరో కోణంలో నష్టాన్ని భర్తి చేయబోతున్నారట.