Power star : పెండింగ్ ప్రాజెక్ట్స్ కే ఫస్ట్ ప్రయారిటీ

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనలు గురించి తెలిసిందే. పోటీచేసిన ప్రతీ నియోజగవర్గంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 7, 2024 | 01:00 PMLast Updated on: Jun 07, 2024 | 1:00 PM

Power Star Pawan Kalyan Has Recently Created A Stir In Politics

 

 

పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తాజాగా రాజకీయాల్లో సృష్టించిన ప్రకంపనలు గురించి తెలిసిందే. పోటీచేసిన ప్రతీ నియోజగవర్గంలోనూ తన అభ్యర్థులను గెలిపించుకుని సరికొత్త రికార్డు సృష్టించాడు. ఇక.. పవన్ మునుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో సైతం క్రియాశీలకంగా మారబోతున్నాడనే సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయాలతో తనమునకలై ఉండబోతున్న పవన్ కళ్యాణ్.. సినిమాల పరిస్థితి ఏంటి? అనే విషయమే ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కిట్టీలో మూడు చిత్రాలున్నాయి. అవే.. ‘హరిహర వీరమల్లు, (Harihara Veeramallu) ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్’ (Ustad Bhagat Singh). ఈ సినిమాలలో ‘ఓజీ’ (OG) సినిమా సెప్టెంబర్ 27న విడుదల తేదీ ఖరారు చేసుకుంది. డి.వి.వి. (DVV Danayya) ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణంలో సుజీత్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పార్ట్ చాలా వరకూ కంప్లీట్ అయ్యింది. ఇంకా.. పవన్ కేవలం ఈ సినిమాకోసం రెండు, మూడు వారాల డేట్స్ ఇస్తే చాలట.

ఈ ఏడాదే పవన్ కళ్యాణ్ నుంచి రానున్న మరో మూవీ ‘హరిహర వీరమల్లు’. క్రిష్, జ్యోతికృష్ణ కంబైన్డ్ డైరెక్షన్ లో రూపొందుతోన్న ‘హరి హర వీరమల్లు’ రెండు భాగాలుగా రాబోతుంది. ఫస్ట్ పార్ట్ ను ఈ ఏడాదే విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు.. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా కూడా కొంత భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది. త్వరలోనే.. ఈ సినిమాని తిరిగి సెట్స్ పైకి తీసుకెళ్లాలనేది మేకర్స్ ఆలోచన. ఇలా.. పవన్ పూర్తిచేయాల్సిన సినిమాలు మూడున్నాయి. వీటితో పాటు.. ‘హరిహర వీరమల్లు పార్ట్ 2’, ‘ఓజీ పార్ట్ 2’.. ఆ తర్వాత సురేందర్ రెడ్డి, త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులతోనూ సినిమాలున్నాయి. కానీ.. ప్రస్తుతం పవన్ కి ఉన్న రాజకీయ సంబంధాల నేపథ్యంలో పెండింగ్ ప్రాజెక్ట్స్ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడనేది ఫిల్మ్ నగర్ టాక్.