Power Star: డైరెక్టర్స్ ని పరుగులు పెట్టిస్తున్న పవన్ కళ్యాణ్..!
పవన్‌కళ్యాణ్ దూకుడుని దర్శకులు తట్టుకోలేకపోతున్నారు. ఒకేసారి మూడు సినిమాలకు వరుస డేట్స్ ఇచ్చేయడంతో.. డైరెక్టర్స్ పరుగులు తీయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉస్తాద్ భగత్‌సింగ్ కోసం హరీష్ శంకర్ కెమెరా యాంగిల్స్ చూసుకుంటుంటే.. OG మూవీ కోసం సుజిత్ లొకేషన్స్ వెతుక్కునే పనిలో వున్నాడు. పవన్...ఎన్టీఆర్ సినిమాలు రెగ్యులర్ షూటింగ్‌లోకి ఎప్పుడు వెళ్తాయో చూద్దాం.

power Star Speed up Projects
నాలుగైదు రోజులు మినహాయిస్తే.. పవన్‌కల్యాణ్ నెల రోజులుగా సెట్స్‌పైనే వున్నాడు. సాయిధరమ్‌తేజ్‌తో నటిస్తున్న వినోదయ సిత్తమ్ తెలుగు రీమేక్‌లో పవన్ పార్ట్ షూటింగ్ దాదాపు పూర్తయింది. నాన్‌స్టాప్‌గా నటించిన ఒక పాట మినహా తన పార్ట్ టాకీని కంప్లీట్ చేసేశాడు. ఏప్రిల్ 5 నుంచి హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కే ఉస్తాద్ భగత్‌సింగ్ షూటింగ్‌లో పాల్గొంటాడు పవన్. మండువా ఇంటి సెట్లో షూటింగ్ ప్లాన్ చేశారు దర్శకుడు.
పవన్ చేతిలో వున్న మరో మూవీ OG షూటింగ్ నెలాఖరులో మొదలవుతుంది. సినిమా మాఫియా బ్యాక్‌డ్రాప్ కావడంతో.. ముంబాయ్‌లో లొకేషన్స్ వేటలో వున్నాడు దర్శకుడు సుజిత్. ఇలా పవన్ ఈమధ్యకాలంలో ఫస్ట్ టైం ఒకేసారి రెండు సినిమాలు చేస్తూ.. ఉస్తాద్, OG షూటింగ్ పూర్తిచేస్తాడట.
ఈమధ్యనే లాంఛనంగా మొదలైన ఎన్టీఆర్, కొరటాల సినిమా రెగ్యులర్ షూటింగ్‌లోకి వచ్చేస్తోంది. ప్రత్యేకంగా వేసిన హార్బర్ సెట్‌లో ఈనెల 29 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తారు. కోస్టర్ ఏరియాలో జరిగే కథతో ఈ సినిమా రూపొందుతోంది. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్ కెన్ని బైట్స్ నేతృత్వంలో ఫైటింగ్‌తో సినిమా మొదలయ్యే అవకాశం వుంది. రీసెంట్‌గా కెన్ని బైట్స్.. ప్రొడక్షన్ డిజైనర్ సాబు సిరిల్‌తో చర్చిస్తున్న ఫొటో రిలీజ్ చేశారు.