og september 27 : టీ గ్లాస్ తో ఓజీ తుఫాన్ ..!
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ 'ఓజీ' (OG). డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఈ సినిమాకి ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు.

Power star Pawan Kalyan starrer gang star movie OG release announcement
పవర్ స్టార్ (Power Star) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా సుజీత్ దర్శకత్వంలో రూపొందుతోన్న గ్యాంగ్ స్టర్ ఫిల్మ్ ‘ఓజీ’ (OG). డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పవర్ స్టార్ రేంజ్ కి తగ్గ వసూళ్ళ సునామీ సృష్టించే సత్తా ఈ సినిమాకి ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ ఆ అంచనాలను, ఫ్యాన్స్ నమ్మకాన్ని రెట్టింపు చేసింది. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా సెప్టెంబర్ 27న విడుదల కానుందని ఇటీవల వార్తలు వినిపించాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా మేకర్స్ అఫీషియల్ గా రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు.
‘ఓజీ’ చిత్రాన్ని సెప్టెంబర్ 27న విడుదల చేయనున్నట్లు తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో నల్ల కళ్లద్దాలు, చేతిలో టీ గ్లాస్ పట్టుకొని.. వింటేజ్ గెటప్ లో కారు పక్కన నిల్చొని ఉన్న పవన్ కళ్యాణ్ లుక్ అదిరిపోయింది. రీసెంట్ టైంలో పవర్ స్టార్ బెస్ట్ లుక్ అని ఇప్పటికే విడుదలైన ‘ఓజీ’ ప్రచార చిత్రాలు రుజువు చేయగా.. తాజా పోస్టర్ లో లుక్ వేరే లెవెల్ లో ఉంది. పవన్ కళ్యాణ్ స్టార్డంకి, లుక్ కి తగ్గట్టుగా సరైన కంటెంట్ తోడైతే.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అంచనాలకు మించిన సంచలనాలు సృష్టిస్తుంది అనడంలో సందేహం లేదు.
సెప్టెంబర్ 27 అనేది పవర్ స్టార్ ఫ్యాన్స్ కి స్పెషల్ డేట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘అత్తారింటికి దారేది’ (Atharintiki Daaredi) సినిమా 2013లో సెప్టెంబర్ 27న విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇప్పుడు సరిగ్గా 11 ఏళ్లకు అదే తేదీకి ‘ఓజీ’ వస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ‘ఓజీ’ చిత్రీకరణ ఇప్పటికే 70 శాతానికి పైగా పూర్తయిందని సమాచారం. ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఈ సినిమా కోసం డేట్స్ కేటాయించనున్నాడు. పవన్ ఇప్పటికే దాదాపు ఆయన షూటింగ్ పార్ట్ ని పూర్తి చేశాడని, కేవలం మరో రెండు వారాల డేట్స్ కేటాయిస్తే సరిపోతుందని వినికిడి.