Pawan Kalyan: దటీస్ పవన్ కళ్యాణ్.. ఇంకొన్ని రోజుల్లో లక్షలు కాదు.. కోట్లు..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ఎనిగ్మా. నచ్చాడంటే అంతే వదలరు. అది తన ఫ్యాన్ ఫాలోయింగ్ కి కారణం. ఆ క్రేజ్ ఎలాంటిదో అప్పడప్పుడు మళ్లీ ప్రూవ్ అవుతుంది.. ఇప్పుడు అదే జరుగుతోంది..లక్షల్లో కాదు, కోట్లల్లో తనేంటో ప్రూవ్ చేస్తున్నాడు.

Power star Pawan Kalyan started his Instagram account on Tuesday and within hours the number of followers increased
పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మంగళవారం ఇన్ స్టా గ్రామ్ లో అడుగుపెట్టాడో లేదో కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ వచ్చేశారు. 12 గంటల్లోనే రెండు మిలియన్ల ఫాలోవర్స్ వైపు పవన్ ఇస్ స్టా ఎకౌంట్ అన్నారు. కట్ చేస్తే ఒక్కో రోజు లక్షల్లో ఫాలోవర్స్ చూస్తుంటే, ఇక పవన్ ఫాలోయర్స్ లెక్కలో కోట్లల్లోకి మారేలా ఉన్నాయి.
ఇప్పటి వరకు టాలీవుడ్ లో 21. 6 మిలియన్లు అంటే 2 కోట్ల 16 లక్షల ఫాలోవర్స్ తో అల్లు అర్జున్ టాప్ లో ఉంటే, తర్వాత ప్లేస్ లో రీచ్ లో 18. 6 మిలియన్లు అంటే కోటీ 86 లక్షల ఫాలోవర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఇక 16 మిలియన్లతో థర్ట్ ప్లేస్ లో రామ్ చరణ్ ఉన్నాడు.
అయితే వీల్లందరినీ కేవలం 10 డేస్ లో పవన్ కళ్యాణ్ దాటేస్తాడనంటున్నారు. రోజుకు మిలియన్ ఫాలోవర్స్ లెక్కన వేసుకుంటే, పదిరోజుల్లో పవన్ కనీసం 3 కోట్లకు పైనే ఫాలోవర్స్ ని సొంతం చేసుకునే చాన్స్ ఉంది. అసలు పోస్ట్ పెట్టకముందే కొన్ని గంటల్లోనే లక్షల్లో ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్న పవన్, పర్ఫెక్ట్ అప్ డేట్స్ ఇస్తే, మాత్రం ఫాలోవర్స్ లో కూడా ట్రెండ్ సెట్ చేసే రికార్డులు సొంతమయ్యే అవకాశం ఉంది.