POWER STAR SHOW: ఆహాలో స్ట్రీమింగ్ కానున్న బాలయ్య అన్ స్టాపబుల్-2

dialtelugu author

Dialtelugu Desk

Posted on: February 2, 2023 | 02:31 PMLast Updated on: Feb 02, 2023 | 2:31 PM

Power Star Show ఆహాలో స్ట్రీమింగ్ కాను

నట సింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా నిర్వహిస్తున్న అన్‌ స్టాపబబుల్ సెకండ్ సీజన్‌ క్లైమాక్స్‌కు చేరింది. ఫినిషింగ్ టచ్‌ పవర్‌ ఫుల్‌గా ఉండేలా ప్లాన్‌ చేసింది ఆహా. ఇందులో భాగంగానే పవర్‌ స్టార్‌ పవన్ కళ్యాణ్‌తో చివరి ఎపిసోడ్‌ ప్లాన్‌ చేసింది. చిన్న టీజర్‌తోనే సోషల్‌ మీడియాను షేక్‌ చేసింది. దీంతో ఈ టాక్ షోపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. రెండు పార్టులుగా స్ట్రీమింగ్ కానున్న టాక్‌ షోలో తొలి పార్ట్‌.. ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో ఆహా కూడా ప్రమోషన్స్‌తో హోరెత్తిస్తోంది.

ఇక పవర్‌ స్టార్‌ అభిమానులు సైతం హంగామా చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ల్యాబ్స్‌లో ఈ షోను టెలికాస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హంగామా చేశారు. అంతేకాకుండా ప్రమోషన్స్‌లో భాగంగా హోర్డింగ్స్‌ను ఏర్పాటు చేయడం విశేషం. చరిత్రలో తొలిసారి ఒక టాక్‌ షోకు సంబంధించి ఇలా భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేయడం తొలిసారి. విజయవాడలో పవన్‌, బాలకృష్ణలతో కూడిన భారీ కటౌట్స్‌ను ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే ప్రభాస్‌తో జరిగిన షో సందర్భంగా ఒకేసారి ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున యాప్‌ ఓపెన్‌ చేయడంతో క్రాష్‌ అయిన విషయం తెలిసిందే.

అయితే ఈసారి అలాంటి సమస్య తలెత్తకుండా ఉండడానికి ఆహా నిర్వాహకులు పకడ్బందీ ప్లాన్‌ వేశారని సమాచారం. అంతేకాకుండా బాలయ్య అడిగిన ప్రశ్నలకు పవన్‌ ఎలాంటి సమాధానం చెప్పారనే ఉత్సాహం అందరిలోనూ ఉంది. పవన్‌తో పాటు సాయి ధరమ్‌ తేజ్‌ కూడా షోలో కనిపించడం మరో ప్రత్యేక ఆకర్షణగా చెప్పొచ్చు. మరి స్ట్రీమింగ్‌కి ముందే ఇలా ఉంటే స్ట్రీమింగ్ మొదలైన తర్వాత ఈ షో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.