Power Star: పవన్ త్రివిక్రమ్ కాంబోలో మరో సినిమా.. కాకపోతే చిన్న ట్విస్ట్..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడి త్రివిక్రం కలిసి మరో సినిమా చేయబోతున్నారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాలతో వీళ్లిద్దరి కాంబోకు మంచి క్రేజ్ ఏర్పడింది. వీటి తరువాత వచ్చిన అజ్ఞాతవాసి నిరాశపర్చినా.. వీళ్ల కాంబోకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. నేరుగా పవన్‌తో సినిమా తీయకపోయినా.. ఆయన సినిమాల్లో ఏదో ఒక రకంగా పాలు పంచుకుంటున్నాడు గురూజీ.

Pawan Trivikram Sudheer varma
భీమ్లానాయక్ సినిమాలో ఓ సాంగ్ రాశాడు. సముద్రఖని డైరెక్షన్‌లో వస్తున్న వినోదయాసితం రీమేక్‌కు కూడా స్క్రిప్ట్ విషంలో తన వంతు సాయం చేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కోసం ఓ స్టోరీ రెడీ చేశాడట త్రివిక్రమ్. కానీ డైరెక్షన్ మాత్రం స్వామిరారా ఫేం సుధీర్ వర్మతో చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడట. ఈ విషయాన్ని సుధీర్ వర్మ స్వయంగా చెప్పాడు. ఒకరోజు త్రివిక్రమ్ సుధీర్ వర్మకు కాల్ చేశాడట. తాను అనుకుంటున్న లైన్ గురించి చెప్పి.. పవన్‌ను నేను ఒప్పిస్తాను సినిమా చేసేందుకు రెడీగా ఉండూ అంటూ హామీ ఇచ్చాడట.
దీంతో త్వరలోనే వీళ్ల కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని చెప్పాడు సుధీర్ వర్మ. అయితే ఈ ప్రాజెక్ట్ చాలా ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ ఇప్పటికే నాలుగు సినిమాలకు సైన్ చేశాడు. ఇందులో వినోదయసితం రీమేక్ షూటింగ్ దాదాపు పూర్తికాగా.. క్రిష్ డైరెక్షన్‌లో హరిహరవీరమళ్లు రెడీగా ఉంది. అది పూర్తవగానే సుజీత్ డైరెక్షన్‌లో ఓజీ సినిమా చేయాల్సి ఉంది. దాని తరువాత హరీష్ శంకర్‌తో ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాకు కూడా సైన్ చేశాడు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలు అన్నీ పూర్తైన తరువాత త్రివిక్రమ్ స్టోరీని సుధీర్ వర్మతో పవన్ చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ లేట్ అయినా సరే.. గురూజీ, పవర్‌స్టార్ కాంబినేషన్ అనగానే ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.