Power Star: హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ వార్నింగ్.. అయినా నో ఛేంజ్..!
హరీష్ శంకర్ కి పవన్ కళ్యాణ్ రెండు సార్లు వార్నింగ్ ఇచ్చాడట. వారం గ్యాప్ లో రెండు సార్లు ఈ దర్శకుడి గూబ గుయ్ మనే వార్నింగ్స్ పడ్డాయని తెలుస్తోంది. అందులో ఒకటి పూజా హెగ్డే వెంటపడటం మానేయ్ మని పవన్ చెప్పడం..

Pawan Kalyan warning to Harish Shankar
డీజే మూవీ నుంచే పూజా హెగ్డేతో హరీష్ శంకర్ కి మంచి ర్యాపో ఉంది. అందుకే ఉస్తాధ్ భగత్ సింగ్ లో హీరోయిన్ గా చేయమంటూ పూజా వెంటపడుతున్నాడట. భవధీయుడు భగత్ సింగ్ చేసేందుకు రెడీ అయిన తను, టైటిల్ తోపాటు కథ మారటంతో పవన్ మూవీ చేయనందనటం, దీంతో తన ప్లేస్ లో మరో హీరోయిన్ ని తీసుకోమని పవన్ పురమాయించటం జరిగిందంటారు..
శ్రీలీల ఒక ఆప్సన్ అనుకున్నాక కూడా మల్లీ మల్లీ పూజా హెగ్డే డేట్స్ కోసం హరీష్ ప్రాకులాడుతున్నాడని తెలిసి, పవన్ పిలిచి క్లాస్ పీకాడట. మొన్నేమో తెలంగాణ మంత్రిని ఈమూవీలో విలన్ గా చేయమంటూ తను సరదాగా అడిగిన మాట, మంత్రి నోట్లోంచి బయటికి రావటం, పెద్ద రచ్చవ్వటం జరిగింది. అప్పుడు హరీష్ ని పిలిచి క్లాస్ పీకిన పవన్, ఇప్పుడు హీరోయిన్ విషయంలో మళ్లీ క్లాస్ పీకాల్సి వచ్చిందట