Power Star: పవన్ కళ్యాణ్ కి తెలియకుండానే తప్పు జరిగిపోయిందా..?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ టైటిల్ మీద వివాదం పెరిగేలాఉంది. నిజానికి ఉస్తాద్ అన్నది ఇస్మార్ట్ శంకర్ హిట్ తర్వాత రామ్ కి ఫ్యాన్స్ ఇచ్చిన బిరుదు. అందులో ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ అనిపించుకున్నాడు కాబట్టి అదే కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు అక్కడే లెక్క తేడా కొడుతోంది.

Harish Shankar and Poori titile issue
అసలు వివాదం ఏంటంటే, పూరీ మొత్తానికి రామ్ తో సినిమా కన్ఫామ్ చేసుకున్నాడు. టైటిల్ గా డబుల్ ఇస్మార్ట్ శంకర్ కాకుండా, ఉస్తాద్ టైటిల్ పెట్టాలనుకున్నాడు. కాని ఆ టైటిల్ ఆల్రెడీ వేరే వాళ్లు రిజిస్టర్ చేసుకున్నారు. దీనికి తోడు పూరీ శిష్యుడైన హరీష్ శంకర్ భవధీయుడు భగత్ సింగ్ టైటిల్ ని ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చాడు. ఆ టైటిల్ మీదే పూరీ, హరీష్ మధ్య చర్చ జరిగిందట. కాని ఒకసారి పవన్ కోసం ఎనౌన్స్ చేసిన టైటిల్ ని పూరీ అడిగాడని ఇవ్వటం కుదరదు.. అదే అక్కడ కన్ క్లూజన్ అంటున్నారు.
ఇక గతంతో రామ్ ఏ మూవీ చేసినా యాక్టింగ్ లో పవన్ ని కాపీ కొడతాడనే కామెంట్స్ వచ్చేవి. అలాంటిది, ఇప్పుడు రామ్ బిరుదునే పవన్ సినిమాకు పెట్టారనే కౌంటర్స్ పడుతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రమేయం లేకుండా, హరీష్ చేసిన పనికి, ఇలా పవర్ స్టార్ గురించి సోషల్ మీడియాలో, ఫిల్మ్ నగర్ లో ఇలాంటి చర్చ పెరిగింది.