ప్రభాస్ 550 కోట్లు.. తారక్ 370 కోట్లు.. మహేశ్ మాత్రం 0000 కోట్లు..?

టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ హీరోలను దాటి హాలీవుడ్ స్టార్స్ రేంజ్ ని మీట్ అవుతున్నారు. రెబల్ స్టార్ ఏకంగా 550 కోట్ల రెమ్యునరేషన్ తో హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో చేరాడు. వార్ 2 మూవీకి, అలానే డ్రాగన్ కి 370 కోట్లు పారితోషికం అందుకుంటున్న ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ స్టార్ రేంజ్ ని రీచ్ అవుతున్నాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: January 3, 2025 | 02:07 PMLast Updated on: Jan 03, 2025 | 2:07 PM

Prabhas 550 Crores Tarak 370 Crores Mahesh 0000 Crores

టాలీవుడ్ స్టార్స్ బాలీవుడ్ హీరోలను దాటి హాలీవుడ్ స్టార్స్ రేంజ్ ని మీట్ అవుతున్నారు. రెబల్ స్టార్ ఏకంగా 550 కోట్ల రెమ్యునరేషన్ తో హాలీవుడ్ స్టార్స్ లిస్ట్ లో చేరాడు. వార్ 2 మూవీకి, అలానే డ్రాగన్ కి 370 కోట్లు పారితోషికం అందుకుంటున్న ఎన్టీఆర్ కూడా హాలీవుడ్ స్టార్ రేంజ్ ని రీచ్ అవుతున్నాడు. ఆఖరికి నిన్నకాక మొన్న పుష్ప2 తో హిట్ మెట్టెక్కిన బన్నీ కూడా 350 కోట్ల రెమ్యునరేషన్ అందుకున్నాడు. కాని విచిత్రంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు మాత్రం జూనియర్ ఆర్టిస్ట్ కంటే ఘోరంగా మారాడు. తను రాజమౌళి మూవీకి కేవలం సున్నా అంటే సున్న నే పారితోషికంగా పొందుతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఏమీ, చారిటీ కోసం తీస్తోంది కాదు. పక్కా కమర్శియల్ మూవీ… రాజమౌళి కెరీర్ లో ఫస్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్టు గా ఈ సినిమా తెరకెక్కబోతోంది. ఆల్రెడీ లాంచైంది. అలాంటి ఈమూవీకి సింగిల్ ఎంపీ తీసుకోకుండా మహేశ్ బాబు పనిచేసేందుకు సిద్దపడ్డాడా? పాన్ ఇండియా ఇమేజ్ వస్తుందని తన పారితోషికాన్ని త్యాగం చేశాడా? అక్కటే ట్విస్ట్ ఉంది. రాజమౌళి కూడా పైసా తీసుకోవట్లేదు కాబట్టే, మహేశ్ బాబు కూడా పారితోషికాన్ని పక్కన పెట్టాడని తెలుస్తోంది… ఈ మొత్తం మ్యాటర్ లో ఉన్న ట్విస్ట్ ఏంటో చూసేయండి.

సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీనే చేయలేదు. అయినా సరిలేరు నాకెవరు నుంచే సినిమాకు 150 కోట్లు తీసుకుంటున్నాడు. గుంటూరు కారానికి ఏకంగా 2 వందలకోట్లు అందుకున్నాడన్నారు. ఇలాంటి స్టార్ ఇక పాన్ ఇండియా మూవీ చేయాల్సి వస్తే, ఏకంగా మూడేళ్లు ఒకే సినిమా కోసం డేట్లు ఇవ్వాల్సి వస్తే, కనీసం 300 కోట్ల నుంచి 500 కోట్లు తీసుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు..

ఇమేజ్ తో పాటు మార్కెట్ మీద తనకున్న కమాండ్ వల్ల అంత డిమాండ్ చేసే ఛాన్స్ ఉంది. కాని రాజమౌలి సినిమాకు తనకి దక్కేది శూన్యం.. అంటే అక్షరాల సున్నా… జీరో ఎమౌంట్ కే సూపర్ స్టార్ మహేశ్ బాబు రాజమౌళి తీసే పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ లాంచైంది. చాలా సీక్రెట్ గా ఈ సినిమా ను లాంచ్ చేశాడు రాజమౌళి. మళ్లీ స్పెషల్ ప్రెస్ మీట్ పెట్టి అంతా వివరిస్తానన్నాడు.. అంతవరకు బానే ఉంది కాని, మహేశ్ బాబుకి వందల కోట్లు కాదు కనీసం కోటి కూడా ఇవ్వకుండా సరిపెట్టుకోమనటమే షాకింగ్ న్యూస్

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా తీస్తే పాన్ ఇండియా నుంచి పాన్ వరల్డ్ వరకు హీరోల ఇమేజ్ పెరిగిపోతుంది. బాహుబలి, త్రిబుల్ ఆర్ తో ప్రభాస్, చరణ్, ఎన్టీఆర్ పేరు ఇలానే మారుమోగింది. అలా పాన్ వరల్డ్ మార్కెట్ దక్కుతుందనే మహేశ్ ఇలా పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్నాడా అంటే అదేం లేదు. అక్కడే లాజిక్ ఉంది

మహేశ్ బాబు తో రాజమౌైలి ప్లాన్ చేసిన మూవీ టైటిల్ గోల్డ్, లేదంటే మహారాజా పేరు వినిపించింది. కాని అఫీషియల్ గా వర్కింగ్ టైటిల్ ని SSMB29గా ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాకు మహేశ్ మాత్రమే కాదు, రాజమౌళి కూడా పైసా తీసుకోకుండా పని చేస్తున్నాడు. నిర్మాతేం వీళ్ల చుట్టం కాదు… ఈ సినిమా ఏమి చారిటీకోసం తీయట్లేదు. కాబట్టి ఖచ్చితంగా దర్శకుడు, హీరో వాళ్ల రేంజ్ కి, 3 ఏళ్ల డేట్స్ కి తగ్గట్టే రెమ్యునరేషన్ తీసుకోవాలి.

అక్కడే భారీ ట్విస్ట్ ఉంది. వెయ్యికోట్ల బడ్జెట్ తో తెరకెక్కబోతున్న ఈ సినిమా రిలీజ్ అయ్యాక వచ్చే వసూల్లలో, పెట్టుబడి పోను ప్రాఫిట్స్ లో సగం నిర్మాతకు…మిగతా సగం హీరో తోపాటు దర్శకుడికి… అంటే హీరోకి 25 శాతం, దర్శకుడికి 25 శాతం లాభాల్లో వాటా దక్కింది.

ఈ లెక్కన ఈ సినిమా 2000 కోట్లు రాబడితే, వెయ్యికోట్లు పెట్టుబడి పోను మహేశ్ కి 250 కోట్లు, రాజమౌళికి 250 కోట్లు దక్కే ఛాన్స్ ఉంది. అలా కాకుండా అంచనాలను మించేలా ఇది 3 వేల కోట్లు రాబడితే, మహేశ్, రాజమౌళి తలా ఓ 500 కోట్లు తీసుకెళతారు. అంతకుమించి వస్తే పండగ చేసుకోవాల్సిందే…. అందుకే పైసా తీసుకోకుండా సినిమా చేస్తున్నారు ఈ ఇద్దరు.