Prabhas Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ రివ్యూ..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఆదిపురుష్ మీద ఎలాంటి అంచనాలు ఉన్నాయో సపరేట్గా చెప్పాల్సిన పనిలేదు. టీసిరీస్ నిర్మాణ సంస్థలో భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆదిపురుష్ ట్రైలర్‌ను ఇవాళ రిలీజ్ చేసింది మూవీ టీం. ఇదే ట్రైలర్‌ను త్రిడీ వెర్షన్లో ఒకరోజు ముందు థియేటర్లో రిలీజ్ చేసింది.
హైదరాబాద్ ఏఎంబీ మాల్లో ఆదిపురుష్ ట్రైలర్ లాంచ్‌కు ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ కూడా వచ్చారు. ఇవాళ అధికారికంగా లాంచ్ అయిన ఈ ట్రైలర్‌కు వరల్డ్‌వైడ్‌గా మంచి రెస్పాన్స్ వస్తోంది. 3 నిమిషాల 20 సెకన్లు ఉన్న ట్రైలర్లో దాదాపు అరణ్యపర్వం కవర్ చేశారు. రామ లక్ష్మణులు, హనుమంతుడు సీత మధ్య డైలాగ్స్‌ను రివీల్ చేశారు. రాముడు యుద్ధానికి వెళ్లిడం, ఆయనకు వాణరసేన తోడు రావడంతో లాంటి కీ ఫ్యాక్టర్స్‌ను రివీల్ చేశారు. జైశ్రీరాం సాంగ్‌తో పాటు, డైలాగ్స్‌ను కూడా ట్రైలర్లో యాడ్ చేశారు. ముందు రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్స్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా ఇంప్రెస్సివ్‌గా ఉంది. రామాయణం కథ ఇండియన్స్‌కు పాతదే అయినా.. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటిస్తుండటంతో సినిమా మీద ఓ రేంజ్లో హైప్ క్రియేట్ అయ్యింది. భారీ బడ్జెట్‌తో సినిమా తెరకెక్కుతుండటం, పాన్ వరల్డ్‌మూవీగా వస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్‌కు సినిమా మీద ఓ రేంజ్లో అంచనాలు పెరిగిపోయాయి.
కానీ ఫస్ట్ రిలీజ్ చేసిన ట్రైలర్ ఫ్యాన్స్‌ను నిరాశపర్చింది. దీంతో సినిమా మీద క్రియేట్ అయిన హైప్ మొత్తం ఒక్కసారిగా కొలాప్స్ అయ్యింది. తరువాత రిలీజ్ చేసిన పోస్టర్ మీద కూడా తెగ ట్రోలింగ్స్ వచ్చాయి. ఒకకానొక స్టేజ్‌లో సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయండి, ఈ దారుణాన్ని మేం థియేటర్స్‌లో చేడలేం అన్నారు ఫ్యాన్స్. దీంతో ఇప్పుడు రిలీజ్ చేసిన ట్రైలర్ విషయంలో మూవీ మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. హనుమాన్ జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన హనుమాన్ పోస్టర్, ఆ తరువాత రివీల్ చేసిన శ్రీరాముడి లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం రిలీజ్ ఐన ట్రైలర్లో కూడా లుక్స్ దాదాపు నేచురల్‌గా ఉన్నాయి. ప్రభాస్ వాయిస్‌లో బేస్ గురించి తెల్సిందేగా.. దానికి తోడు ఆయన చెప్పింది రాముడి డైలాగ్స్ ఇంకే ముంది ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్నారు. సినిమా మీద ముందు నుంచీ వచ్చిన నెగటివిటీని ఈ ట్రైలర్పక్కకు నెట్టే చాన్స్ ఉంది.