Prabhas: వెంకన్న సన్నిదిలో శ్రీరాముడి రాజ్యం.. ఫ్యాన్స్ కోసం భారీ ఏర్పాట్లు చేసిన ప్రభాస్..
తిరుపతిలోని ఎస్వీయూ కాలేజ్ గ్రౌండ్ కాషాయ రంగులోకి మారిపోయింది. ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అన్ని ఏర్పాట్లు చేశారు చిత్ర నిర్మాతలు. ఈ ఈవెంట్ కోసం ఏకంగా రెండు కోట్లు ఖర్చు చేసినట్టు సామాచారం.
అయితే ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను అన్ని ఈవెంట్‌లు ఏర్పాటు చేసినట్టు కాకుండా డిఫరెంట్‌గా ప్లాన్ చేశాడు ప్రభాస్. అయోధ్య, కిష్కింద, మితిలా, పంచవటి పేర్లతో నాలుగు సెక్షన్లను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో అయోధ్య, మిథిలా.. వెనక భాగంలో కిష్కంద, పంచవటిని ఏర్పాటు చేశారు. అయోధ్య, మిథిలను మూవీ యూనిట్, చీఫ్ గెస్ట్‌ల కోసం ఏర్పాటు చేశారు. మిగిలిన రెండు సెక్షన్లను అభిమానుల కోసం కేటాయించారు. నాలుగు సెక్షన్లకు వేర్వేరుగా పాసులు ఏర్పాటు చేశారు.
ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా వేర్వేరు ఎంట్రీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్‌కు లక్ష మంది ఫ్యాన్స్ వస్తారని మేకర్స్ అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ప్రస్తుతం ఏర్పాట్లు చేశారు. ఈవెంట్ నిర్వహణ మొత్తం డైరెక్షర్ ప్రశాంత్ వర్మ పర్యవేక్షిస్తున్నాడు. ఈవెంట్ ఆర్గనైజర్లను దగ్గరుండి కోఆర్డినేట్ చేస్తున్నాడు. ఈ ఈవెంట్ బాధ్యత తీసుకోవాల్సిందిగా ప్రశాంత్ వర్మను ప్రభాస్ కోరాడట.
దీంతో అన్నీ తానై ఏర్పాట్లు చేస్తున్నాడు ప్రశాత్ వర్మ. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ హనుమాన్ అనే సినిమా తీస్తున్నాడు. ఆదిపురుష్‌లో ప్రభాస్ రాముడిగా కనిపించబోతున్నాడు. రాముడు అడగటంతో హనుమంతుడు పనులు పర్యవేక్షిస్తున్నాడంటున్నారు ఫ్యాన్స్. గతంలో బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఇక్కడే జరిగింది. ఆ సినిమా అప్పట్లో బాక్సాఫీస్ రికార్డ్‌లు తిరగరాసింది. ఇప్పుడు ఆదిపురుష్ కూడా అదే రేంజ్ హిట్ అవ్వాలని ఈ ఈవెంట్‌ను కూడా ఇక్కడే ప్లాన్ చేసుకున్నాడు ప్రభాస్. సినిమాలో రాముడిగా కనిపించబోతున్న ప్రభాస్.. ఫ్యాన్స్ అందరినీ రామరాజ్యానికి తీసుకువెళ్లలేక ఆ రాజ్యాన్నే తిరుపతిలో ఏర్పాటు చేసి అభిమానులను త్రిల్ చేయబోతున్నాడు.