Prabhas: ప్రభాస్‌తో అల్లు అర్జున్‌ థియేటర్‌ ఓపెనింగ్‌..

సినిమా హీరోలు కావచ్చు నార్మల్‌ పర్సన్స్‌ కావొచ్చు. జీవితంలో ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగంతో పాటు మరో సంపాదన ఉంటే మంచిది. ఇది మేము చెప్పే మాట కాదు.. చాలా మంది ఆర్థిక నిపుణులు చెప్పిన మాట.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 1, 2023 | 12:29 PMLast Updated on: Jun 01, 2023 | 12:29 PM

Prabhas Adipurush Release In Allu Arjun Theater

ఈ ఫార్ములాను సామాన్యులు పట్టించుకుంటున్నారో లేదో కానీ.. సినిమా హీరోలు మాత్రం బాగానే ఫాలో అవుతున్నారు. సినిమాలు చేస్తూనే సొంత బిజినెస్‌లు ప్రారంభిస్తున్నారు. కొందరు రియల్‌ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్‌ చేస్తుంటే.. కొందరు మాత్రం హోటల్స్‌ పెడుతున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏంటంటే.. స్టార్‌ హీరోలు మాత్రం మల్టీప్లెక్స్‌ బిజినెస్‌ వైపు ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నారు.

ఇప్పటికే మహేష్‌ బాబు, విజయ్‌ దేవరకొండ సొంతగా థియేటర్స్‌ కట్టి సక్సెస్‌ అయ్యారు. రీసెంట్‌గా అల్లు అర్జున్‌ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఏసియన్‌ సినిమాతో కలిసి ట్రిపుల్‌ ఏ.. అంటే ఏసియన్‌ అల్లు అర్జున్‌ పేరుతో మల్టీప్లెక్స్‌ నిర్మిస్తున్నాడు. అమీర్‌పేట్‌లోని సత్యం థియేటర్‌ ప్లేస్‌లో ఈ కొత్త థియేటర్‌ కడుతున్నారు. ఆల్మోస్ట్‌ బిల్డింగ్‌ కంప్లీట్‌ అయ్యింది. కొన్ని ఎక్స్‌టీరియర్‌ పనులు మాత్రం మిగిలి ఉన్నాయి.

ఇక్కడ హైలెట్‌ ఏంటంటే.. అల్లు అర్జున్‌ బెస్ట్‌ ఫ్రెండ్‌ ప్రభాస్‌ రాముడిగా నటించిన ఆదిపురుష్‌ సినిమాతోనే ఈ థియేటర్‌ ఓపెనింగ్‌ చేయబోతున్నారట. థియేటర్‌ ఓపెనింగ్‌కు ప్రభాస్‌ కూడా వస్తాడని టాక్‌ నడుస్తోంది. ఆదిపురుష్‌ సినిమా కోసమే పనులను పరుగు పెట్టిస్తున్నాడట అల్లు అర్జున్‌. మొత్తం 5 స్క్రీన్‌లు 13 వందల మంది సీటింగ్‌ కెపాసిటీతో థియేటర్‌ డిజైన్‌ చేయించుకున్నడాట. ఇప్పటికే చాలా వరకూ పనులు పూర్తి కాగా.. మిగిలిన పనులు చాలా ఫాస్ట్‌గా కంప్లీట్‌ చేయిస్తున్నాడట.

ముందు నుంచి అల్లు అర్జున్‌, ప్రభాస్‌ మంచి ఫ్రెండ్స్‌. ఇద్దరు ఒకరినొకరు బావ అంటే బావ అని పిలుచుకుంటారు. ఇక అల్లు స్క్రీన్‌ మీద ప్రభాస్‌ బొమ్మ పడితే ఫ్యాన్స్‌ సందడి ఎలా ఉంటుందో చూడాలి.