Prabhas: ఆదిపురుష్‌ నుంచి రెండో ట్రైలర్‌.. రిలీజ్‌ డేట్‌ ఎప్పుడంటే..

ప్రభాస్‌ శ్రీరాముడిగా కనిపించనున్న ఆదిపురుష్‌ సినిమా మీద ఆడియన్స్‌కు ఏ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉన్నాయో సెపరేట్‌గా చెప్పాల్సిన పని లేదు. రీసెంట్‌గా వచ్చిన మోషన్‌ పోస్టర్‌, ట్రైలర్‌లకు వచ్చిన రెస్పాన్స్‌ చూస్తే చాలు బొమ్మ ఏ రేంజ్‌లో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: June 4, 2023 | 01:33 PMLast Updated on: Jun 04, 2023 | 1:33 PM

Prabhas Adipurush Second Trailer

దీంతో ఫ్యాన్స్‌ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఆదిపురుష్‌ నుంచి మరో ట్రైలర్‌ రిలీజ్‌ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్‌. రెండున్నర నిమిషాల డ్యురేషన్‌తో కొత్త ట్రైలర్‌ కట్‌ చేసినట్టు సమాచారం. జూన్‌ 6న తిరుపతిలో జరగనున్న ఆదిపురుష్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఈ ట్రైలర్‌ రిలీజ్‌ చేయబోతున్నారట. ఇప్పుడంటే అంతా ఆదిపురుష్‌ జపం చేస్తున్నారు కానీ.. ఫస్ట్‌ గ్లింప్స్‌ వచ్చినప్పుడు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. ఇదేంటి కార్టూన్‌ సినిమా తీశారంటూ తెగ ట్రోల్‌ చేశారు. ఇక ప్రభాస్‌, హనుమాన్‌, రావణాసురుడి లుక్స్‌ విషయంలో ఓం రౌత్‌ను ట్రోల్‌ చెయ్యనివాళ్లు లేరు.

ఒకానొక స్టేజ్‌లో ప్రభాస్‌ ఫ్యాన్స్‌ కూడా అసహనానికి గురయ్యారు. ఈ సినిమాను థియేటర్‌లో చూసే ధైర్యం మాకు లేదంటూ ఇంటర్నెట్‌లో తమ నిస్సహాయతను ఓం రౌత్‌కు వెల్లబుచ్చుకున్నారు. కానీ హనుమాన్‌ జయంతి సందర్భంగా వచ్చిన హనుమాన్‌ పోస్టర్‌తో ఫస్ట్‌ టైం ఆదిపురుష్‌ పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ తరువాత వచ్చిన రాముడి లుక్‌, ట్రైలర్‌ సినిమా మీద ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేశాయి. ఇక జైశ్రీరాం సాంగ్‌ రిలీజ్‌ చేయడంతో ఒక్కసారిగా సీన్‌ మారిపోయింది.

అప్పటి వరకూ ఓం రౌత్‌ను ట్రోల్‌ చేసినవాళ్లంతా సారీ చెప్పారు. ఈ ఒక్క సాంగ్‌ సినిమా తలరాతను మార్చేసింది. అసలు థియేటర్‌కు ఆడియన్స్‌ వస్తారో లేదో అనుకున్న సినిమా.. రిలీజ్‌కు ముందే బడ్జెట్‌ ఎమౌంట్‌ కలెక్ట్‌ చేసింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి తరువాత రాబోయే ట్రైలర్‌ మీదే ఉంది. ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌, ట్రైలర్‌ సినిమా మీద అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇప్పుడు రిలీజ్‌ చేయబోయే కొత్త టీజర్‌ ఇంకా ఏ రేంజ్‌లో ఉండబోతోందనని ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు ఫ్యాన్స్‌.