Prabhas: ఆ ఫీట్ సాధించినవి 4 సినిమాలే.. అందులో 2 ప్రభాస్ సినిమాలే..!
దేశం మొత్తం ఒకే సినిమా కోసం ఎదురు చూస్తోంది. అదే ఆదిపురుష్. ఇదే సినిమా.. ఎందుకొస్తుందిరా బాబు.. ఏంటా గ్రాఫిక్స్ అని టీజర్ చూసినప్పుడు కామెంట్ చేశారు. కాని ట్రైలర్, పాటల పుణ్యమాని హైప్‌తోపాటు ఊపు పెరిగింది. 16 తేదీకి ఎన్నిరోజుల టైంలేదు.
Prabhas: ఇండియా మొత్తం ఒక సినిమా కోసం వేయిట్ చేసిందీ అంటే.. అది ఖచ్చితంగా బాహుబలి-2 కోసమే. ఎందుకంటే కట్టప్ప ఎందుకు బాహుబలిని చంపాడో తెలుసుకునేందుకు దేశమంతా బాహుబలి-2 కోసం ఎదురు చూసింది. దీంతో సినిమా రిలీజయ్యాక రికార్డులు క్రియేట్ అయ్యాయి.
ఇప్పుడు ఇలానే దేశం మొత్తం ఒకే సినిమా కోసం ఎదురు చూస్తోంది. అదే ఆదిపురుష్. ఇదే సినిమా.. ఎందుకొస్తుందిరా బాబు.. ఏంటా గ్రాఫిక్స్ అని టీజర్ చూసినప్పుడు కామెంట్ చేశారు. కాని ట్రైలర్, పాటల పుణ్యమాని హైప్‌తోపాటు ఊపు పెరిగింది. 16 తేదీకి ఎన్నిరోజుల టైంలేదు. అందుకే ఆదిపురుష్ కోసం వేయిట్ చేసే జనాల సంఖ్య పెరుగుతోంది. నిజానికి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ హిస్టరీలోనే, బాహుబలి-2 తర్వాత అంత ఆతృతగా మరో మూవీకోసం ఎవరైనా వేయిట్ చేశారంటే, అది కేజీయఫ్-2 కోసమే.
అలానే 5 ఏళ్లు కనిపించకుండా పోయినా షారుఖ్‌ని మళ్లీ తెరమీద చూసేందుకు కూడా పఠాన్ కోసం అలానే వేయిట్ చేశారు. ఇలా ఈగర్‌గా వేయిట్ చేసి చూసిన మూవీలన్నీ రూ.1000 కోట్ల పైనే వసూళ్లు రాబట్టాయి. అంటే ఆదిపురుష్ కూడా కనీసం వెయ్యి కోట్లు, కుదిరితే 1500 కోట్లు రాబట్టినా ఆశ్చర్య పోనక్కర్లేదా..? టాక్ బాగుంటే, బాహుబలి-2 తాలూకు 1800 కోట్ల రికార్డు కూడా బ్రేక్ అవ్వొచ్చు.