PRABHAS-ALLU ARJUN: బన్నీ, ప్రభాస్ నిర్ణయంతో రూమర్స్‌కి బ్రేక్ పడినట్టేనా..?
విడుదల ఆలస్యం లేదని, మే చివరికల్లా పుష్ప 2 షూటింగ్ పూర్తవుతుందని తేల్చింది ఫిల్మ్ టీం. అంతేకాదు జూన్ నుంచి బోయపాటి సినిమా షూటింగ్‌కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. అంటే ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని తేల్చేస్తున్నాట్టున్నాడు బన్నీ.
PRABHAS-ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సుకుమార్ తీస్తున్న పుష్ప 2 మూవీ ఆగస్ట్ 15కి రిలీజ్ అన్నారు. ఎప్పుడో ఎనౌన్స్‌మెంట్ వచ్చింది. కాని, తర్వాత రీషూట్లు, రిపేర్లు, గ్రాఫిక్స్ వర్క్ ఆలస్యం అవుతుండటంతో, విడుదల తేదీ డిసెంబర్‌కి వాయిదా పడొచ్చన్నారు. అయితే, విడుదల ఆలస్యం లేదని, మే చివరికల్లా పుష్ప 2 షూటింగ్ పూర్తవుతుందని తేల్చింది ఫిల్మ్ టీం. అంతేకాదు జూన్ నుంచి బోయపాటి సినిమా షూటింగ్‌కి బన్నీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.
Pawan Kalyan: హిస్టరీ రిపీట్.. అప్పుడు ‘అత్తారింటికి దారేది’.. ఇప్పుడు ఓజీ
అంటే ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితే లేదని తేల్చేస్తున్నాట్టున్నాడు బన్నీ. బన్నీతోపాటు రెబల్ స్టార్ కూడా ఇదే విషయంలో తగ్గనంటున్నాడు. వెనకడుగే వేసేదిలేదనేశాడు. కల్కి 2898 ఏడీ మూవీ విడుదల తేదీలో ఎలాంటి మార్పుకి ఛాన్స్ లేదని తేల్చేశాడు. ఈ మూవీ పక్కగా మే 09కి రిలీజ్ అవుతుందట. దానికి తగ్గట్టే ప్రమోషనల్ ఈవెంట్‌లు ప్లాన్ చేశారు. ఫిబ్రవరి 11న ఈమూవీ టీజర్ సూపర్ బౌల్ ఈవెంట్లో రిలీజ్ కాబోతోంది. మార్చ్ నుంచి ఏప్రిల్ చివరి వరకు సాంగ్స్ రిలీజ్ చేయబోతున్నారు.
ఇక ట్రైలర్‌ని మే 2కి లాంచ్ చేయబోతోంది ఫిల్మ్ టీం. ఇలా అన్నీ పక్కాగా ఫిక్స్ అయ్యాయని తెలుస్తోంది. దీంతో ప్రభాస్, అల్లు అర్జున్.. ఇద్దరూ ముందుగా చెప్పిన డేట్‌కు తమ సినిమాల్ని తీసుకొస్తున్నారు.