PRABHAS: రెబల్ మహల్.. ప్రభాస్ కొత్త సినిమా పేరు ఇదేనా..?

నిజానికి సలార్ ఈనెలలో రాబోతోంది. మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. ఇక మారుతి మూవీ దసరాకే రావొచ్చు అని అన్నారు. అంతా ఓకే మరి వేసవి, వర్షాకాలం, చలికాలం ప్రభాస్ సినిమాల సందడి అంటే అర్ధం ఏంటి..? అక్కడే ప్రభాస్ ప్లానింగ్ మతిపోగొడుతోంది.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: December 5, 2023 | 06:28 PMLast Updated on: Dec 05, 2023 | 6:28 PM

Prabhas And Hanu Raghavapudi Combo Movie Title Is Rebel Mahal

PRABHAS: రెబల్ మహల్.. వింటానికి విచిత్రంగా ఉన్నా ఇలాంటి టైటిల్‌తో ప్రభాస్ మూవీ రాబోతోందంటే నమ్ముతారా..? ప్రస్తుతానికి ఇది వర్కింగ్ టైటిలే.. కేవలం ప్రభాస్‌తో హను రాఘవపూడి చర్చించిన టైటిల్ బయటికి రివీల్ అయింది. దీంతో ఎక్స్‌‌క్లూజివ్‌గా ఇలా దాని వెనకున్న కథేంటో చెప్పాల్సి వస్తోంది. నిజానికి సలార్ ఈనెలలో రాబోతోంది. మే 9న కల్కి 2898 ఏడీ రిలీజ్ కానుంది. ఇక మారుతి మూవీ దసరాకే రావొచ్చు అని అన్నారు. అంతా ఓకే మరి వేసవి, వర్షాకాలం, చలికాలం ప్రభాస్ సినిమాల సందడి అంటే అర్ధం ఏంటి..?

SALAAR: డార్లింగ్‌ ఎక్కువగా కనిపించడా.. సలార్‌లో ప్రభాస్‌ రోల్‌ తగ్గించారా..?

అక్కడే ప్రభాస్ ప్లానింగ్ మతిపోగొడుతోంది. ఈ వేసవిలో సీతారామం ఫేం హను రాఘవపూడి మేకింగ్‌లో ప్రభాస్ చేయబోయే సినిమా పట్టాలెక్కబోతోంది. దాని వర్కింగ్ టైటిలే రెబల్ మహాల్. అంటే ప్రేయసి కోసం తాజ్ మహల్ కట్టించిన షాజహాన్‌లా ప్రభాస్ కూడా రొమాంటిక్ కిక్ ఇచ్చే మూవీనే చేయబోతున్నాడని తేలింది. హను రాఘవపూడి.. ప్రభాస్‌తో రాధా కృష్ణల ప్రేమ కథకి మాడ్రన్ వర్షన్ చెప్పబోతున్నాడట. ఇది వచ్చే‌ ఏప్రిల్‌లో పట్టాలెక్కబోతోంది. ఆ మరుసటి నెలలో కల్కి రిలీజ్ కానుంది. ఇక వర్షాకాలంలో సందీప్ రెడ్డి వంగ మేకింగ్‌లో ప్రభాస్ చేసే స్పిరిట్ పట్టాలెక్కబోతోంది.

అలా అది ఆగస్టులో పట్టాలెక్కితే.. వచ్చే ఏడాది క్రిస్మస్ సీజన్‌లో సలార్ 2ని పట్టాలెక్కిస్తాడట ప్రశాంత్ నీల్. ఇలా ఒక్కో సీజన్‌లో ఒక్కో సినిమా రిలీజ్‌తోపాటు మూడు సీజన్లలో మూడు కొత్త మూవీలు పట్టాలెక్కించబోతున్నాడు ప్రభాస్.