PRABHAS: ప్రభాస్ కోసం ఆ రేంజ్ మాస్ మూవీ రెడీ చేస్తున్న దర్శకుడు
అందుకే ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తే కంటెంట్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి. సలార్ సక్సెస్‌తో అది రుజువైంది. అలా కాకుండా ప్రేమకథలు, ఇంకేవో వ్యథలు తీస్తే రాధేశ్యామ్ రిజల్టే రిపీట్ అవుతుంది.

Prabhas has a fight with the producer.. No promotions for Salar
PRABHAS: ప్రభాస్ కటౌట్‌కి తగ్గ సినిమా అంటే సలారే. నిజమే ఆ భారీ కటౌట్‌కి సాలిడ్ కంటెంట్, యాక్షన్ సీక్వెన్స్ తోడైతే వందలకోట్ల వరదలే అని సలార్ నిరూపించింది. బాహుబలి 1, బాహుబలి 2తో వచ్చిన ఇమేజ్, క్రేజ్‌తో సాహో కంటెంట్ వీకైనా తన కటౌట్‌కి, పెర్ఫామెన్స్ తోపాటు ఫైట్లకి జనం ఫిదా అయ్యారు. అందుకే కేవలం ప్రభాస్ ఇమేజ్‌తో సాహో ఆడింది. అందుకే ప్రభాస్ లాంటి స్టార్‌తో సినిమా ప్లాన్ చేస్తే కంటెంట్ నెవర్ బిఫోర్ అనేలా ఉండాలి.
Mallu Bhatti Vikramarka: సినిమా రేంజ్‌లో భట్టి లవ్‌స్టోరీ.. ప్రేమకథలో ఇన్ని ట్విస్ట్‌లా..
అలా కాకుండా ప్రేమకథలు, ఇంకేవో వ్యథలు తీస్తే రాధేశ్యామ్ రిజల్టే రిపీట్ అవుతుంది. బాక్సాఫీస్‌ని షేక్ చేసే సత్తా ఉన్న హీరోతో అనవసరపు ప్రయోగాలు కాకుండా, థ్రిల్ చేసే ప్రాజెక్టులు చేయాలని రాధేశ్యామ్, ఆదిపురుష్ పంచ్‌లతో తేలింది. సలార్ సక్సెస్‌తో అది రుజువైంది. అందుకే సీతారామం లాంటి క్లాసిక్ హిట్ సొంతం చేసుకున్న హనురాఘవపూడి మేకింగ్‌లో సినిమా అంటే అంతా భయపడుతున్నారు. సీతారామం ఎంత బాగున్నా ఆ టైపు సినిమాలు ప్రభాస్‌తో తీస్తే బాగుందంటారు కాని, బాక్సాఫీస్ మాత్రం షేక్ అవుతుందనే గ్యారెంటీ ఎవరూ ఇవ్వరు. మరి నిజంగానే హను రాఘవపూడి ప్రభాస్‌తో ప్రేమ కావ్యం తీయడం లేదు. ప్రభాస్‌తో నాగ్ అశ్విన్ తీస్తున్ కల్కి 2898 ఏడీ సినిమాలో ఓ సైన్స్ ఫిక్షన్‌కి మైథాలజీ యాడ్ చేశారు.
ఇక మారుతి తీస్తోన్న ది రాజా సాబ్ కామెడీ జోనర్‌లో వస్తున్నా మాస్ ఎలిమెంట్స్‌కి కొదువ లేదని ఫిల్మ్ టీం తేల్చింది. అలానే హనురాఘవపూడి కూడా సెకండ్ వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్‌లో ప్రభాస్ మూవీ ప్లాన్ చేసినా అది పూర్తిగా మాస్ యాక్షన్ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాగా ఉండేలా ఐదు జోనర్లు కలిపేస్తున్నాడట. కాబట్టి తెలివైన నిర్ణయమే తీసుకున్నట్టు తెలుస్తోంది.