PRABHAS: రెబల్ స్టార్‌తో లోకేష్.. అసలు సంగతి ఇది..!

లోకేష్‌కి ఎంత ఖైదీ, లియో, విక్రమ్ లాంటి హిట్లున్నా ప్రభాస్‌తో సినిమా అంటే ప్రమోషన్ వచ్చినట్టే. తనకి కూడా రెబల్ స్టార్‌తో సినిమా తీయాలనేది కల అన్నాడు. ఆ కల నెరవేర్చాలనే, ప్రభాస్‌తో ఇప్పటికే నాలుగు సార్లు కలిసి కథా చర్చలు చేశాడు.

dialtelugu author

Dialtelugu Desk

Posted on: March 27, 2024 | 06:05 PMLast Updated on: Mar 27, 2024 | 6:05 PM

Prabhas And Lokesh Kanagaraj Movie On Cards But It Will Happen Only

PRABHAS: రెబల్ స్టార్ ప్రభాస్‌కి లోకేష్ కనకరాజ్‌తో సినిమా చేయటం డ్రీమ్ అంటే ఎవరైనా నమ్ముతారా..? ఖైదీ నుంచే తనతో ప్రభాస్ టచ్‌లో ఉన్నాడట. ప్రభాస్ రేంజ్‌కి కాల్ చేస్తే లోకేష్ అయినా, మరెవరైనా వచ్చి తనతో సినిమా తీయాల్సిందే. పాన్ ఇండియాలోనే తనలాంటి ఇమేజ్, మార్కెట్ ఎవరికీ లేదు. అంతగా బాహుబలి తర్వాత తన ఇమేజ్ నార్త్‌లో పెరిగిపోయింది. అలాగని లోకేష్ కనకరాజ్‌ని ప్రభాస్ ప్రెజర్ చేయలేదు కాని, తనతో సినిమా చేయాలనుకున్నాడు.

Siddharth: ఒక్కటయ్యారు.. హీరోయిన్‌తో సిద్దార్థ్ సీక్రెట్ మ్యారేజ్..

లోకేష్‌కి ఎంత ఖైదీ, లియో, విక్రమ్ లాంటి హిట్లున్నా ప్రభాస్‌తో సినిమా అంటే ప్రమోషన్ వచ్చినట్టే. తనకి కూడా రెబల్ స్టార్‌తో సినిమా తీయాలనేది కల అన్నాడు. ఆ కల నెరవేర్చాలనే, ప్రభాస్‌తో ఇప్పటికే నాలుగు సార్లు కలిసి కథా చర్చలు చేశాడు. కానీ, ఈ కాంబినేషన్ ఇప్పట్లో వర్కవుట్ అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే ప్రభాస్ కల్కి తర్వాత ది రాజా సాబ్ పూర్తి చేయాలి. వెంటనే హనురాఘవ పూడి మూవీ, ప్యారలల్‌గా సలార్ సీక్వెల్, ఆ తర్వాత సందీప్ రెడ్డి స్పిరిట్ పట్టాలెక్కబోతోంది. కాబట్టి, మూడేళ్ల వరకు ప్రభాస్ బిజీ.

అలాగే రజినీకాంత్‌తో జూన్‌లో మూవీ మొదలు పెట్టబోతున్న లోకేష్ కనకరాజ్.. ఆ తర్వాత ఖైదీ 2, లియో 2, విక్రమ్ 2 అని మరో మూడేళ్లు ఈ సినిమాలతోనే బిజీగా గడపబోతున్నాడు. ఆ తర్వాత కుదిరితే ప్రభాస్, లోకేష్ కాంబినేషన్ సెట్ అవ్వొచ్చు. లేదంటే లేదు.