Prabhas: యూఎస్ మీడియాలో ప్రాజెక్ట్ కే ప్రభంజనం.. కుళ్లుకుంటున్న బాలీవుడ్..
ప్రాజెక్ట్ కే గ్లింప్స్ హాలీవుడ్ మూవీ అవెంజర్స్, ఐరన్ మ్యాన్, డ్యూన్ తో పోలుస్తున్నారు. అమెరికా మ్యాగజైన్ నుంచి యూరప్ మీడియా వరకు ప్రాజెక్ట్ కే కి మంచి కవరింగ్ దక్కింది. చిన్న పాటి గ్లింప్స్ తో ఈమూవీకి గ్లోబల్ గా గుర్తింపు దక్కుతోంది. విచిత్రం ఏంటంటే ఓతెలుగు దర్శకుడు రాజమౌళి వచ్చి పాన్ఇండియా గేట్లు తీస్తే, నాగ్ అశ్విన్ వచ్చి పాన్ వరల్డ్ గేట్లు బద్దలు కొడుతున్నాడు.
ఇద్దరూ తెలుగు వాళ్లే.. దీంతో సౌత్ దర్శకులని చూసి ఇప్పటికే జలసీతో ఉడికిపోతున్న బాలీవుడ్ బ్యాచ్, ప్రాజెక్ట్ కే గ్లింప్స్ కి వస్తున్న రెస్పాన్స్ తో బీటౌైన్ బ్యాచ్ అసూయతో భరించలేకపోతోంది. ఆల్రెడీ కొన్ని వర్గాలు ప్రాజెక్ట్ కే గ్లింప్స్ మీద నెగెటీవ్ ప్రచారాలు పెంచాయి.
ఏదేమైనా ఎవడే సుబ్రమణ్యం తీసిన దర్శకుడేనా ప్రాజెక్ట్ కే తీసింది అనుకునేలా చేశాడు నాగ్ అశ్విన్. కేవలం రెండు సినిమాలు తీసి ఇలా మహానటి తర్వాత ఏకంగా పాన్ వరల్డ్ డైరెక్టర్ గా మారిపోతున్నాడు నాగ్అశ్విన్. అంతేకాదు రాజమౌళి ఒక్కో మెట్టెక్కి పైకొస్తుంటే, ఒకేసారి లిఫ్ట్ లో పైకొచ్చి జక్కన్ననే మించిపోయాడు ప్రాజెక్ట్ కే దర్శకుడు. సందీప్ రెడ్డి వంగ, లోకేష్ కనకరాజ్, ప్రశాంత్ నీల్ ఇలా అంతా ఒకటి రెండు హిట్లతో రాజమౌళినే మించిపోయారు.